Sunday, August 10, 2025

ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం – 2025 వేడుకలు: ముఖ్యఅతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు

నారద వర్తమాన సమాచారం

ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం – 2025 వేడుకలు
: ముఖ్యఅతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు

జిల్లా గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నందలి గుర్రం జాషువా సమావేశ మందిరము లో ప్రపంచ ఆదివాసి దినోత్సవం ఘనముగా నిర్వహించడమైనది.

ఈ కార్యక్రమము నందు వివిధ గిరిజన సంఘ నాయకులు మరియు జిల్లాలోని గిరిజనులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.

పలు సాంస్కృతిక కార్యక్రమములతో విద్యార్ధులు అలరించారు.

నాయకులు మాట్లాడుతూ
గిరిజన భవన్ ను నిర్మించ వలసినదిగా మరియు ఆధార్ కార్డ్లు లేని గిరిజనులకు ఆదార్ కార్డ్లు మరియు ఇండ్ల స్థలములు ఇప్పించ వలసినదిగా పల్నాడు కలెక్టర్ పి అరుణ్ బాబు ను కోరడమైనది.

పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు స్పందించి గిరిజన భవన నిర్మాణము నకు అవసరమైన ప్రతి పాదనలు పంప వలసినదిగా మరియు గిరిజనులకు ఆదార్ కార్డ్లు లేని వారికి ఆదార్ కార్డ్లు ఇండ్ల స్థలములు లేని వారికి ఇండ్ల స్థలములు మంజూరు చేయుటకు చర్యలు తీసుకోన వలసినదిగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారిని ఆదేశించడమైనది.

భారత ప్రభుత్వం పి.ఎం జన్ మన్ పథకం నందు 9 ప్రభుత్వ శాఖల సహకారము తో 11 స్కీమ్ ల ద్వారా గిరిజనుల (చెంచులు) అభివృధికి అనేక చర్యలు తీసుకొంటున్నది.

ఈ పథకము ద్వారా అన్ని చెంచు గూడెంల యందు అర్హులైన వారికి గృహములను కట్టించుట, రోడ్లను వేయించుట, తాగునీటి సరఫరా చర్యలు తీసుకొనుట, అంగన్ వాడి సెంటర్ లను ఏర్పాటు చేయడం.

భారత ప్రభుత్వం డి.ఏ.జుగా పథకం ద్వారా గిరిజనుల అభివృధికి 17 ప్రభుత్వ శాఖల సహకారముతో 25 స్కీంలు అమలు పరచడం జరుగుచున్నది.

ఈ పథకము క్రింద జిల్లా లో ఐదు మండలములోని ఏడు గ్రామాలలోని 17 గిరిజన కాలనీలు / హబిటేషన్ ఎంపిక చేసి ఆ గ్రామాల యందు గృహములను కట్టించుట, రోడ్లను వేయించుట, తాగునీటి సరఫరా చర్యలు తీసుకొనుట, అంగన్ వాడి సెంటర్ లను ఏర్పాటు చేయుట జరుగుచున్నదని తెలిపియున్నారు.

2024-25 విద్యా సంవత్సరంలో 10 వ తరగతి నందు 550 పైన మార్కులు సాధించిన గిరిజన విద్యార్ధులైన బి. సాయి తేజ నాయక్ మరియు కె. సంపత్ నాయక్ లకు కలెక్టర్ పి అరుణ్ బాబు చేతుల మీదుగా ఒకొక్కరికి 5 వేల నగదు పారితోషకం అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమము నకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారిని జోస్న,గిరిజన సంఘ నాయకులు కోటా. నాయక్,పాండు నాయక్, విష్ణు నాయక్, మేడా పోతు రాజు, శ్రీ రావుల కొండలు మరియు కె. దాసు తదితరులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading