నారద వర్తమాన సమాచారం
మాత ఈశ్వరి దేవి అమ్మవారి మందిరం పునః నిర్మాణం నిమిత్తం రెండు లక్షల 30 వేల రూపాయలను అందజేసిన ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం
ఈశ్వర దేవి అమ్మవారి మందిర పున :నిర్మాణం.
ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘంతరుపున 2.30.00 రు విరాళముగా శివ కుమార స్వామి వారికి. నగదు అందజేసిన జిల్లా కమిటీ సభ్యులు
పొదిలి విరాట్ నగర్ లో వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో. వీరబ్రహ్మేంద్రస్వామి మఠం లో ఉన్న ఈశ్వర దేవి. అమ్మవారి మఠాధిపతులు.. శ్రీ శ్రీ వీర శివకుమార్ స్వాములవారు. విచ్చేసి. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో. హాజరై ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ. జగన్మాత ఈశ్వరి దేవి అమ్మవారి పూజ మందిరం పున: నిర్మాణం కొరకు . రాష్ట్ర ప్రభుత్వము మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భక్తుల నుండి 60 లక్షల రూపాయలు జమ చేయవలసినది. అందుకుగాను భక్తులకు అవగాహన కల్పిస్తూ. ఈశ్వరి దేవి అమ్మవారు ప్రకాశం జిల్లాలో వారు చాలా చోట్ల ప్రచారాలు కల్పించి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞాన తత్వాలను అందరికీ తెలియపరచిన మహా జ్ఞాని. వారి దేవాలయ పున నిర్మాణానికి. దాతల సహకారంతో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సేకరించిన విరాళం. 2.30.000 రు.లను. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు చెన్నుపల్లి శ్రీనివాసాచారి. ప్రధాన కార్యదర్శి కుందుర్తి సీతారామాంజనేయులు. కోశాధికారి రాచర్ల శేఖరు. కలిసి స్వామివారికి నగదు ను అందించారు.. స్వామివారిని పూర్ణ కుంభతొ. స్వాగతంపలికి. స్వామివారు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు తదుపరి భక్తులెల్లరు స్వామి వారి పాదాభి పూజ చేసుకుని. స్వామివారి ఆశీస్సులు అమ్ముతున్నారు. ఎక్కువ సంఖ్యల మహిళా భక్తులు అమ్మవారి భక్తులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు గుత్తికొండ కళ్యాణ్. రాచర్ల బాల బ్రహ్మచారి.పులుకూరి నాగేశ్వరరావు. సమంత పూడి బాలసుబ్రమణ్యం. మహిళా సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పోలూరు సుజాత చోడ వెంకట సుబ్బారావు. ఉప్పులూరిబాబు. దేవస్థాన అధ్యక్షులు మాచ బత్తిన గోవిందయ్య. నిమ్మ ల సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.