నారద వర్తమాన సమాచారం
79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు
పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహణ.
ఈరోజు (15.08.2025) 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని, పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శ్రీ కంచి.శ్రీనివాస రావు, ఐపీఎస్ జాతీయ జెండాను ఎగురవేసి, ఇతర పోలీస్ అధికారులు, పోలీస్ సిబ్బందితో కలసి గౌరవ వందనం చేశారు.
ఎస్పీ పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, స్వయంగా మిఠాయిలు పంచిపెట్టారు
“భిన్నత్వంలో ఏకత్వం” ఉట్టి పడే విధంగా — కుల, మత, వర్గ, ఆర్థిక భేదాలు అన్నింటినీ పక్కన పెట్టి దేశమంతా జరుపుకునే ఏకైక వేడుక స్వాతంత్ర్య దినోత్సవం అని ఆయన తెలిపారు.
మన స్వేచ్ఛ, సమానత్వాల కోసం పూర్వీకులు చేసిన త్యాగాలు, యుద్ధాలు, తిరుగుబాట్లు ఫలితంగా ఈ రోజు మనం స్వతంత్ర భారతదేశ పౌరులమయ్యామని గుర్తు చేశారు. వారి వారసత్వాన్ని కాపాడుతూ, ప్రతి ఒక్కరూ స్నేహపూర్వకంగా, సోదరభావంతో, అందరికీ అనుకూల వాతావరణం కల్పించాలనే పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు :– ఎస్పీ కంచి.శ్రీనివాస రావు, ఐపీఎస్ అదనపు ఎస్పీ (అడ్మిన్) JV.సంతోష్ అదనపు ఎస్పీ (AR)V.సత్తిబాబు ,అదనపు ఎస్పీ (క్రైమ్) లక్ష్మీపతి ఏ.ఆర్ డిఎస్పీ మహాత్మా గాంధీ రెడ్డి , ఎస్బి సీఐ 1 B. సురేష్ బాబు , యస్బీ 2 P. శరత్ బాబు , RIలు S. కృష్ణ,L.గోపీ నాథ్,M. రాజా, ఇతర పోలీస్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.