నారద వర్తమాన సమాచారం
విధులు నుంచి పట్నం ఎస్ఐ శాశ్వత తొలగీంపు
శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండలం –
ఇటీవల పట్నం పోలీస్ స్టేషన్‌కు ఓ గిరిజన మహిళ సహాయం కోసం వెళ్లింది. తన బంధువైన మరో మహిళ విడాకుల కేసులో భరణం విషయం మాట్లాడడానికి వచ్చిన ఈ అవకాశాన్ని ఎస్సై రాజశేఖర్ దుర్వినియోగం చేశాడు .
“నా కోరిక తీరిస్తేనే న్యాయం చేస్తా, లేకపోతే ఇబ్బందులు తప్పవు” అంటూ లైంగిక వేధింపులకు గురిచేశాడు.
రాత్రివేళల్లో పదేపదే వీడియో కాల్స్ చేసి, తాను నగ్నంగా కనిపించడమే కాకుండా, ఆమెను కూడా బట్టలు విప్పమని ఒత్తిడి చేసేవాడు.
మహిళ భర్త ఎస్సైని తన భార్యను వదిలేయమని వేడుకున్నా, వినిపించుకోలేదు.
అనంతపురం వెళ్ళినప్పుడు కూడా వెంబడించి, బలవంతంగా వాహనంలో ఎక్కాలని ఒత్తిడి చేశాడు.
వేధింపులు మితిమీరడంతో, మహిళ ఒకసారి వీడియో కాల్ సమయంలో రికార్డ్ చేసింది. అందులో టవల్‌లో ఉన్న ఎస్సై, అసభ్యంగా మాట్లాడటం మాత్రమే కాకుండా తన మర్మాంగాన్ని బయటపెట్టి అసభ్య ప్రవర్తన చేశాడు.
ఈ వీడియో బయటకు రావడంతో, కీచక ఎస్సై అసలు రూపం వెలుగులోకి వచ్చింది.
జిల్లా ఎస్పీ తక్షణ చర్య తీసుకుని, రాజశేఖర్‌ను ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.