Wednesday, October 15, 2025

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్

నారద వర్తమాన సమాచారం

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్

ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ, ఆర్ధిక,ఆస్తి తగాదాలు,మోసం మొదలగు ఆయా సమస్యలకు సంబంధించి 86 ఫిర్యాదులు అందాయి.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత గడువులోగా సదరు ఫిర్యాదులను పరిష్కరించడానికి కృషి చేయాలని ఎస్పీ  సూచించారు.

నాదెండ్ల మండలం గిరిజవోలు గ్రామానికి చెందిన షేక్.రబ్బాని, వినుకొండ పట్టణానికి చెందిన షేక్ ఖాజా మొహిద్దిన్, నరసరావుపేట కు చెందిన షేక్ మస్తాన్ భాష అను ముగ్గురు MCA పూర్తి చేసి జాబ్ కొరకు హైదరాబాదు వెళ్ళగా అక్కడ షేక్. జబ్బర్ అనే వ్యక్తి ద్వారా కాసరగడ్డ నరేంద్ర అను అతను పరిచయమై ఐటి జాబ్స్ ఇప్పిస్తానని అందుకు ప్రతిఫలంగా 4,00,000/- రూపాయలు చెల్లించమని,డబ్బులు చెల్లించిన అనంతరం రెండు మూడు నెలలలో IT జాబ్స్ ఇప్పిస్తానని ఆరు నెలల వరకు ఇప్పించనట్లు, ఆరు నెలల అనంతరం ఉద్యోగాలు ఇప్పించనందున నాలుగు లక్షల రూపాయలు వెనకకు తిరిగి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లు, డబ్బులు అడుగుతుంటే బెదిరిస్తున్నట్లు, మేము కేసు పెడతాము అని అంటే నేను కూడా మీ మీద కేసు పెడతాను అని బెదిరిస్తున్నందుకు గాను విచారణ జరిపి తగిన న్యాయం చేయవలసిందిగా  ఎస్పీ ని కలిసి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.

వినుకొండ పట్టణానికి చెందిన తోటం.అజయ్ కు గోద్రెజ్ ప్రాపర్టీస్ లో జాబ్ అని చెప్పి వర్క్ ఫ్రం హోం ఒక ప్లాట్ ఫామ్ క్రియేట్ చేసి అతని ఫోన్ నెంబర్ ను క్రియేట్ చేసి, అతని ఐడి నెంబర్ (216819) ద్వారా డబ్బులు వస్తాయి అని ఆశ చూపించి ఫిర్యాదు కు ప్రాజెక్టు వర్క్ అని చెప్పి రోజు 20,30 ప్రాజెక్టు పనుల ద్వారా కమిషన్ ఇస్తామని చెప్పినట్లు, ఈ విషయం ఫిర్యాది ది.28/07/2025 వ తేదీన తన స్నేహితుడు అయిన చెరుకు పాలెం గ్రామానికి చెందిన సద్దాం ఖాన్ కు తెలియపరచగా ఫిర్యాది కి ఫోన్ పే ద్వారా 58,000/- రూపాయలు పంపినట్లు సదరు సొమ్మును గోద్రెజ్ ప్రాపర్టీస్ వారికి పంపినట్లు, అప్పటి నుండి ది.13/08/2025 వ తేదీ వరకు 35,50,000/- రూపాయలు చెల్లించడం జరిగిందని, అంతట మోసపోయానని గ్రహించిన ఫిర్యాది డబ్బులు అడిగితే ఇంకా ఐదు లక్షల రూపాయలు కడితే మీ డబ్బులు మీకు ఇస్తామని చెబుతున్నట్లు కావున తనకు న్యాయం చేయవలసిందిగా ఫిర్యాది  ఎస్పీ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది.

ఎడ్లపాడు గ్రామానికి చెందిన దొప్పలపూడి శ్రీకాంత్ అను అతను మరియు కొంత మంది రైతులు ఎడ్లపాడు యూనియన్ బ్యాంక్ నందు బంగారం కొదవ పెట్టి వ్యవసాయ రుణం తీసుకున్నట్లు, బ్యాంకు నందు గోల్డ్ అప్రేచర్ గా పని చేయుచున్న నిడమనూరు హరీష్ అను అతను ఫిర్యాదు చేత బంగారం రెన్యువల్ అని చెప్పి ఫిర్యాదుకు తెలియకుండా పత్రాల మీద సంతకాలు చేయించుకున్నట్లు, ఆ పత్రాల ద్వారా హరీష్ మరియు బ్యాంకు సిబ్బంది రైతుల మీద కొత్త అకౌంట్లు తీసి దొంగ బంగారం కొదవ పెట్టి లోన్లు తీసుకున్నట్లు, ఈ వ్యవహారం మొత్తం 2019 వ సంవత్సరం నుండి జరుగుతుండగా 2023 ఆగస్టు నెల లో బ్యాంకు వారి ఆడిట్ లో భాగంగా విజయవాడ నుంచి సిబ్బంది వచ్చి ఆడిట్ చేయగా బంగారం నకిలీదని బయటపడినట్లు, సదరు బ్యాంకు వారు గోల్డ్ అప్రైజర్ హరీష్ మీద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు, ఆ కేసు నందు రైతుల పేర్లను చార్జిషీట్ లో సాక్షులుగా చేర్చినట్లు, కానీ రుణం తీసుకున్న వారి యొక్క అసలైన బంగారం డబ్బులు కట్టించుకొని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకు గాను ఎస్పీని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.

క్రోసూరు మండలం గరికపాడు గ్రామానికి చెందిన గార్లపాటి అనురాధ అను ఆమెకు పెళ్లి అయిన ఒక సంవత్సరానికి భర్త చనిపోయినట్లు, ఆమెకు ఒక కుమారుడు సంతానం ఉన్నట్లు, అయితే ఆమెకు బంధువైనటువంటి సంగు.శ్రీనివాసరావు బృగబండ గ్రామం, సత్తెనపల్లి మండలం
నకు చెందినటువంటి అతను వివాహం చేసుకుంటానని నమ్మబలికి కొన్ని రోజులు దాచేపల్లి గ్రామంలోని సంగు శ్రీనివాసరావు నివాసంలో సహజీవనం చేసినట్లు, కానీ అతను ఫిర్యాది ని పెళ్లి చేసుకోకుండా గరికపాడు గ్రామంలో వదిలిపెట్టి మోసం చేసినట్లు, అదేవిధంగా గాదేవారి పాలెం లో ఫిర్యాదు ని అడ్డుపెట్టుకొని తెలిసిన వారి వద్ద రెండు లక్షల రూపాయలు తీసుకొని మోసం చేసినందుకు గాను న్యాయం చేయవలసిందిగా ఎస్పీ ని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.

నరసరావుపేట యోగయ్య నగర్ కు చెందిన డ్వాక్రా సురక్ష మహిళ పొదుపు గ్రూపు నందు ఉన్న పదిమంది సభ్యులకు పది లక్షల రూపాయల లోన్ తీసుకున్నట్లు,గ్రూప్ లీడర్ అయిన జాన్ బి కి ఆరోగ్యం బాగా లేకపోవడం వలన సెకండ్ లీడర్ అయిన సుజాత కి ప్రతినెల తొమ్మిది మంది సభ్యులు కలిసి 23,400/- రూపాయలు చొప్పున 15 నెలల కు 3,51,000/- రూపాయలు చెల్లించినట్లు,కానీ రెండవ లీడర్ అయిన సుజాత తన సొంత ప్రయోజనాలకు వాడుకొని బ్యాంకులో జమ చేయనందున గ్రూప్ ఆర్.పి అయిన నూర్జహాన్ కు తెలియపరచగా ఆమె నుంచి ఎటువంటి సమాధానము రాలేదు. అంతట సుజాతను నిలదీయగా గ్రూపు సభ్యుల మీద కర్రలతో దాడి చేసినందుకు గాను న్యాయం చేయవలసిందిగా ఫిర్యాదిఎస్పీని కలిసి అర్జీ ఇవ్వడం జరిగింది.

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు వారి ఫిర్యాదులను రాసి పెట్టడంలో పోలీస్ సిబ్బంది సహాయ సహయ సహకారాలు అందించారు.
అదే విధంగా దూర ప్రాంతాల నుండి వచ్చే అర్జీదారుల కొరకు భోజన ఏర్పాట్లు చేశారు.
ఈ PGRS నందు ఎస్పీ తో పాటు క్రైమ్ అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి మహిళా పోలీస్ స్టేషన్ డి.ఎస్పి M. వెంకటరమణ పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading