నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా.. గురజాల నియోజ వర్గంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు
పంట పొలంలో నాట్లు వేసిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు
ఆదర్శ ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడి స్కూల్ పరిశీలన
జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు బుధవారం ఉదయం గురజాల నియోజకవర్గంలో పర్యటించారు. పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామంలోని వ్యవసాయ భూములను పరిశీలించారు. మాగాణి లోకి దిగి పాటు పాటు లో నాట్లు వేస్తూ రైతులు మరియు కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో వర్షాలు బాగా కురిశాయని మరియు పంట సాగుకు పుష్కలంగా తగినంత నీరు ఉందని, లక్ష 58 వేల హెక్టార్లలో సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు.
ప్రతి రైతు తమ పంటను రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేసుకొని ఇకేవైసీ చేయించుకోవాలని, దానివల్ల పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం వారు అందించే పరిహారం దక్కుతుందన్నారు. రైతుల ఎప్పుడు ఒకటే పంట కాకుండా మంచి దిగుబడును ఇచ్చే పంటలను ఎంచుకొని లాభాలు దిశగా ముందుకు వెళ్లాలని కోరారు.
విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీషులో రాయడం, చదవడం నేర్పించండి
అనంతరం దాచేపల్లి, రామ్ నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. ప్రతి విద్యార్థికి సబ్జెక్టుల వారీగా ఇచ్చే ఫార్మాటివ్ అసెస్మెంట్ బుక్ లెట్లను పరిశీలించారు. ఫార్మాటివ్ అసెస్మెంట్ బుక్ లెట్ల ద్వారా ప్రతి సబ్జెక్టులో, ప్రతీ విద్యార్థి అభ్యాసస్థాయి తెలుసుకోవచ్చన్నారు. సబ్జెక్టులను అర్థం చేసుకోవడంలో విద్యార్థుల అభ్యాసస్థాయిల ఆధారంగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో స్పష్టంగా రాయడం, చదవడం ప్రతి విద్యార్థికి నేర్పించగలిగితే పిల్లలు సొంతంగా సైతం నేర్చుకోగలిగే అవకాశం కల్పించినట్టేనన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు ఆహారాన్ని అందిస్తుందని, విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా చూడాలన్నారు. అనంతరం నారాయణపురం అంగన్ వాడి పాఠశాలలో పిల్లలతో మాట్లాడి ఆంగ్ల భాషలో ఉన్న అక్షరాలను చదివించారు. అంగన్ వాడీల్లో సైతం పీపీ 1, పీపీ 2 కార్యక్రమాలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నిర్వహించి, విద్యకు సరైన పునాది నిర్మించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు, జిల్లా విద్యాశాఖ అధికారిని చంద్రకళ, గురజాల ఆర్డీవో మురళి కృష్ణ, పిడుగురాళ్ల తహశీల్దార్ మధుబాబు, దాచేపల్లి తహశీల్దార్ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.