నారద వర్తమాన సమాచారం
రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉంటే న్యాయస్థానాల్లో నేరస్తులకు కఠిన శిక్షలు వేయించగలం. — ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్
ఈరోజు (22.08.2025) గుంటూరు ఈస్ట్ పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ సాధారణ వార్షిక తనిఖీలు నిర్వహించారు._
పోక్సో కేసులు,గంజాయి, తీవ్ర నేరాలకు సంబంధించిన కేసుల రికార్డులు పరిశీలించి, ఆ కేసుల దర్యాప్తు పురోగతిని పరీక్షించారు.దీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా న్యాయస్థానంలో నిందితులకు శిక్షలు పడే విధంగా కృషి చేయాలని సూచించారు.
ప్రతి కేసు నమోదు చేసిన వెంటనే ఆ కేసుకు సంబంధించిన ప్రతి అంశాన్ని రికార్డుల్లో సమయానుకూలంగా పొందుపరచుకోవాలని, త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసి న్యాయస్థానాల్లో ఛార్జ్ షీట్ దాఖలు పరచాలని సూచించారు. కేసుల్లోనీ రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే న్యాయస్థానాల్లో నేరస్తులకు శిక్షలు అమలయ్యే విధంగా చూడగలం.
రౌడీ షీటర్ల కార్యకలాపాలను, గంజాయి – సరఫరా, విక్రయం, వినియోగం చేసే వారి కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి, వారు చేసే చట్ట వ్యతిరేక కార్యకలాలను నిరోధించాలని ఆదేశించారు.
ప్రస్తుతం కొద్ది రోజుల్లో రానున్న వినాయక చవితి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, గతంలో ఏవైనా ఘటనలు జరిగుంటే వాటికి కారణమైన వారిని బైండ్ ఓవర్ చేయాలని సూచించారు.
కొత్తపేట,లాలాపేట మరియు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ల సీఐలు సమన్వయం కలిగి ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలో ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూస్తూ, అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ,వారిపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు ఈస్ట్ పోలీస్ సబ్ డివిజన్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ లాలాపేట సీఐ శివ ప్రసాద్ కొత్తపేట సీఐ వీరయ్య చౌదరి పాత గుంటూరు సీఐ వెంకట ప్రసాద్ ఎస్పీ సీసీ ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.