నారద వర్తమాన సమాచారం
వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు అనుమతులు తప్పనిసరి…….
ఈ నెల 27 వ తేదిన వినాయక చవితి పండగ సందర్భంగా వినాయక ఉత్సవ నిర్వహాకులు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సింగల్ విండో పద్దతిలో తప్పకుండా అనుమతులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయములోని యస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో వినాయక చవితి పండుగ ఉత్సవాలపై సంబందిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంత , భక్తీ పూర్వక వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్దేశిత నిమజ్జన ప్రదేశాలలో ప్రణాళిక ప్రకారం విగ్రహ నిమజ్జనం జరిగేలా చూడాలన్నారు. నిమజ్జన ప్రదేశాలలో గజ ఈత గాళ్ళను, అవసరమైన చోట బోట్లను అందుబాటులో ఉంచాలని సంబందిత అధికారిని ఆదేశించారు. నిమజ్జన ప్రదేశంలో పబ్లిక్ అనౌన్స్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా ఇబ్బంది కలుగకుండా మరియు పండుగ వాతావరణం చెడకుండా చూడాలని అదేవిధంగా అవంచనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసిన చోట ముందస్తు చర్యలలో భాగంగా విధిగా సి.సి.కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జన ప్రదేశాలలో ఉత్సవ నిర్వాహకులు కాకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన సిబ్బంది ద్వారా నే నిమజ్జనం చేయాలన్నారు.
జిల్లా ఎస్పి కే.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉత్సవ నిర్వాహుకులలో ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించే విధముగా అవగాహనా కల్పించాలన్నారు. మండపాల అనుమతుల కోసం పోలీసు శాఖ నిర్వహిస్తున్న https://ganeshutsav.net/ వెబ్ సైట్ ద్వారా అనుమతులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లా లో ఇప్పటి వరకు 271 మంది దరఖాస్తు చేసుకొన్నారని తెలిపారు. విగ్రాహాలు ఏర్పాటు చేసే ప్రదేశాల విషయంలో సమస్యలు లేకుండా చూడాలన్నారు. విగ్రహాల ఎత్తును బట్టి ఊరేగింపు జరిగే విధంగా వాహనాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఊరేగింపు సమయములో ఎదురు ఎదురుగా ఊరేగింపు జరుగ కుండా చూడాలన్నారు. డి.జే సౌండ్ ఎవరకి అసౌకర్యం కలుగ కుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిమజ్జనం రోజున నిమజ్జన ప్రదేశం దగ్గరలోని మద్యం షాపులు మూసివేయడం జరుగుతుందన్నారు. నిమజ్జన ప్రదేశంలో క్రేన్, గజ ఈతగాళ్ళను అందుబాటులో ఉంచాలన్నారు. వరదలు, వర్షాల దృష్ట్యా అనువైన నిమజ్జన ప్రదేశాలను నిర్ణయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా రెవిన్యూ అధికారి మురళి, గురజాల ఆర్డీవో మురళీ కృష్ణ మునిసిపల్ కమీషనర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొనారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.