నారదా వర్తమాన సమాచారం
స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమము నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు
ప్రతి నెలా 4 వ శనివారం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా నేడు “వర్షాకాలంలో వరదలు మరియు అంటువ్యాధుల నివారణ” అనే అంశంపై పల్నాడు జిల్లా యస్.పి. కంచి.శ్రీనివాస రావు, ఐపీఎస్., ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయం నందు,జిల్లాలోని పోలీస్ స్టేషన్ ల నందు కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా యస్.పి. ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మరియు సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్స్, పోలీస్ కార్యాలయాల నందు స్వచ్ఛత, శుభ్రత కార్యక్రమాలు చేపట్టి, స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర (SASA) ప్రతిజ్ఞ చేయించారు.
ప్రపంచవ్యాప్తంగా అడవులను పెంచడం వలన కరువు కాటకాలు రాకుండా ప్రపంచం మనుగడతో పాటు, ప్రకృతి వైపరీత్యాలను నుండి కాపాడుకోగలము.
తీవ్ర వాతావరణ పరిస్థితులు ఎదుర్కొనుటకు ముందస్తు చర్యలు తీసుకోనుట మరియు మానవ ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించుట, అవరోధాల వల్ల కలిగే వరదలను తగ్గించడం, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మరియు ఇతర అంటువ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకొనుట గురించి తెలిపారు.
తక్కువ లోతు మరియు లోతుగా ఉన్న వర్షపు నీటి డ్రైనేజీ కాలువలను శుభ్రపరచడం, దోమలు గుడ్లు పెట్టే నీటి నిల్వలను నివారించడం, దోమల నివారణ కోసం ఫాగింగ్ కార్యకలాపాలు నిర్వహించడం, తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితిలకు సమయానుకూలంగా విప నిర్వహణకు సంసిద్ధతగా ఉండటం గురించి తెలియజేసారు.
అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఆయా స్టేషన్ లలోని పోలీసు అధికారులు, సిబ్బంది చెట్లు నాటడం,స్టేషన్ పరిసరాలు శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.