నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అంగరంగ వైభవంగా వినాయక చవితి పండుగ ను నిర్వహించిన జిల్లా ఎస్పీ కంచి.శ్రీనివాస రావు ఐపిఎస్., , పోలీసులు సిబ్బంది.
జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి, వినాయక చవితి వేడుకలను ఘనంగా మరియు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
నిత్యం కేసులతో, శాంతి భద్రతల పరిరక్షణలో హడావిడిగా ఉండే పోలీసు జీవితంలో వినాయక చవితి ఆటవిడుపును కలిగించి కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొల్పిందని ఎస్పి గారు తెలిపారు.
ఈ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.
విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుని కరుణ,కటాక్షాలు, వీక్షణాలు జిల్లా ప్రజలపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడిపేలా ఆ లంబోదరుడు దీవించాలని ఆయన ఆకాంక్షించారు.
నేరాల అదుపులో, నేరస్తుల చేదనలో మరియు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు ఆ గణనాధుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుడి ని ప్రార్థించినట్లు తెలిపారు.
భగవంతున్ని శోధించడం మాని, ఆయన కృపకు పాత్రులు అవ్వడానికి అవసరమైన మార్గాలు వెతకడం ఉత్తమమని సూచించారు.
సత్ప్రవర్తన, ఇది నిర్వహణలో నిబద్ధత, చేస్తున్న ఉద్యోగం పట్ల గౌరవం ఉన్నప్పుడే సమాజంలో పోలీసులకు ఒక ప్రత్యేకత ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమం లో ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీ (అడ్మిన్) JV. సంతోష్ ,AR DSP గాంధీ రెడ్డి నరసరావుపేట మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి వెంకట రమణ ,MT RI S. కృష్ణ , నరసరావుపేట ఒకటో పట్టణ సీఐ M.V. చరణ్ , వెల్ఫేర్ RI L.గోపినాథ్ ANS RI యువ రాజ్ నరసరావుపేట రూరల్ ఎస్ఐ కిషోర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.