నారద వర్తమాన సమాచారం
పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డు నందు 30 వేల మందితో నిర్వహించిన “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” భారీ బహిరంగ సభ…..!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించిన రోజు సెప్టెంబర్ ఒకటి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన ఆత్మగౌరవ యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గురజాల నియోజకవర్గం, పొందుగుల గ్రామంలో యరపతినేని శ్రీనివాసరావు సారద్యంలో అడుగు పెట్టి విభజన ఆంధ్రప్రదేశ్ లో విజయ డంకా మోగించటం జరిగింది. అలాంటి చరిత్ర వున్న “సెప్టెంబర్ ఒకటిన” సూపర్ సిక్స్ హామీల్లో కీలక పథకమైన స్త్రీశక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేసి, మహిళలకు ఆర్థిక భరోసాను చేకూర్చిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలిపేందుకు గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డు నందు 30 వేల మందితో నిర్వహించిన “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” భారీ బహిరంగ సభలో రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత పల్నాడు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు మరియు విద్యుత్ శాఖ మంత్రివర్యులుగొట్టిపాటి రవికుమార్ గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గల్లా మాధవి , తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి రాష్ట్ర మాజీ మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, యువ నాయకులు యరపతినేని నిఖిల్ గురజాల నియోజకవర్గ పరిశీలకులు కల్లం రాజశేఖర్ రెడ్డి పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పార్టీ వ్యవస్థాపకులు నటసార్వభౌమ పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







