నారద వర్తమాన సమాచారం
విద్యార్థులు క్రమశిక్షణ, సమయపాలన తో చదువుకుంటేనే గొప్ప విజయాలు సాధించగలరు : ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపిఎస్
పల్నాడు జిల్లా నరసరావుపేట లోని S.S&N కాలేజీ లో ఈరోజు ఉదయం 11 గంటలకు ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. చదువులో ప్రతిభ కనబరచి, పోలీస్ శాఖలో 14 మంది, ఆర్మీలో 2 మంది — మొత్తం 16 మంది విద్యార్థులు ఎంపికైన సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, ఐపిఎస్ స్వయంగా హాజరై, విద్యార్థులకు దుశాలువా,పూల మాలల తో అలంకరించి, మెమెంటోలు అందజేశారు.
ఎస్పీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు :
విద్యార్థులు లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని కష్టపడి చదవాలి. అప్పుడే అద్భుత విజయాలను అందుకోవచ్చు.
చదువులో క్రమశిక్షణ, సమయపాలన చాలా ముఖ్యం.
ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి.
స్నేహితుల ఒత్తిడికి లోను కాకుండా, స్వంత లక్ష్యంపై దృష్టి కేంద్రీకరించాలి.
మాదకద్రవ్యాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.
కష్టపడి చదివితే భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారుతుంది.
ఎస్పీ విద్యార్థులకు ప్రత్యేకంగా మహిళల రక్షణ చట్టం, గంజాయి వాడకంతో కలిగే అనర్థాలు, రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైమ్స్ వంటి సామాజిక సమస్యలపై అవగాహన కల్పించారు.
పోలీసు ఉద్యోగం గురించి ఎస్పీ గారి సందేశం :–
“పోలీసు ఉద్యోగం కేవలం వృత్తి కాదు… ప్రజాసేవకు అంకితమైన ఆదర్శం కావాలి” అని స్పష్టం చేశారు.
ప్రతి పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, నిజాయితీ, పారదర్శకతతో పనిచేయాలని సూచించారు.
ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండాలని సూచించారు. పట్టుదలతో కష్టపడితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చని తెలియజేసి, విద్యార్థులకు ఎస్పీ ప్రేరణ కలిగించారు.
ఈ కార్యక్రమంలో S.S&N కాలేజీ కమిటీ ప్రెసిడెంట్ కపిలవాయి విజయ్ కుమార్ , సెక్రటరీ & కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ గుప్తా NCC మేజర్ B.S.రామకృష్ణం రాజు 23(A) బెటాలియన్ NCC చీరాల హవల్దార్ షంషేర్ సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ M.S. సుధీర్ మరియు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.