నారద వర్తమాన సమాచారం
డ్రోన్ నిఘా నీడలో కొనసాగుతున్న కోటప్పకొండ పరిసర ప్రాంతాలు-జిల్లా ఎస్పి . కంచి శ్రీనివాసరావు ఐపిఎస్.,
జిల్లా ఎస్పీ . ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం నుండి డ్రోన్ తో కోటప్పకొండ పరిసర ప్రాంతాలు, నిర్మానుష్యమైన ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యేక దృష్టి సారించి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహించిన నరసరావు పేట రూరల్ పోలీసులు.
ముఖ్యంగా పేకాట, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిర్మానుష్యమైన ప్రదేశాలలో డ్రోన్ నిఘా… బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నేర నియంత్రణే లక్ష్యంగా క్రైమ్ ప్రోన్ ఏరియాల పై డ్రోన్ కెమెరాలతో నిరంతరం నిఘా కొనసాగుతుందని తెలిపారు….
క్రైమ్ ప్రోన్ ఏరియాల పై డ్రోన్ కెమెరా లను ఉపయోగించి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, చైన్ స్నాచింగ్, రహదారి దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
నేరాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న నిశితమైన ప్రదేశాలను ముందుగా గుర్తించి, పాడుపడిపోయిన బంగ్లాలు,తోటలు, బహిరంగ ప్రదేశాలను, పార్కులు, ముందుగా గుర్తించి,ఆయా ప్రాంతాలపై డ్రోన్స్ పంపి,నిఘా ఏర్పాటు చేయడం జరిగినట్లు తెలిపారు.
కావున ఎవరైన చట్ట వ్యతిరేక మరియు క్రిమినల్ చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరికలు జారీ చేశారు.
జిల్లాలో ఇకపై సాంకేతికతతో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాల నియంత్రించుటకు పల్నాడు పోలీసులు వినూత్న చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎవరికైనా అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే డయల్ 112 లేదా ఈగల్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కి తెలపాలని సూచించారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.