నారద వర్తమాన సమాచారం
పది వరుసలతో అమరావతి ORR – రూ.25వేల కోట్ల భారీ అంచనా
190 కిలోమీటర్ల పొడవుతో, 140 మీటర్ల వెడల్పుతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ – దేశంలోనే తొలిసారి ఇంత పెద్ద స్థాయిలో భూసేకరణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని కేంద్రంగా చేసుకుని ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాజెక్టు వ్యయం తాజాగా భారీగా పెరిగింది. 190 కిలోమీటర్ల పొడవుతో, మొత్తం 10 వరుసల రహదారిగా నిర్మించాలనే ప్రతిపాదనతో ప్రాజెక్టు ఖర్చు సుమారు రూ.25 వేల కోట్లకు చేరుకుంది. ఇందులో ఆరు వరుసలు ప్రధాన రహదారి కోసం, ఇరువైపులా రెండు వరుసలు చొప్పున సర్వీస్ రోడ్ల నిర్మాణం ఉంటాయి.
ప్రారంభ అంచనాలు – 70 మీటర్ల వెడల్పు: ప్రారంభంలో ఈ రింగ్ రోడ్ 70 మీటర్ల వెడల్పుతో ఉండాలని మోర్త్ ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలిపింది. ఆ ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టు ఖర్చు రూ.16,310 కోట్లుగా నిర్ణయించారు. ఇందులో సివిల్ పనులకు రూ.12,995 కోట్లు, 1,702 హెక్టార్ల భూసేకరణకు రూ.2,665 కోట్లు, 124 హెక్టార్ల అటవీ భూముల సేకరణకు రూ.150 కోట్లు, పర్యావరణ అనుమతులకు రూ.200 కోట్లు, ఇతర వ్యయాలకు రూ.300 కోట్లు కేటాయించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.