నారద వర్తమాన సమాచారం
కర్నూలు బస్సు పునరుద్ధరణకు ఎమ్మెల్యే యరపతినేని కు వినతిపత్రం అందజేత..
గురజాల లో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు అధ్యక్షతన జరిగిన గ్రీవెన్స్ కు మాచర్ల నుండి కర్నూలు బస్సు పునరుద్ధరణకు ప్రజలు వినతి పత్రం అందించారు. ఈ సర్వీసు గత సంవత్సరం కాలంగా నిలిపివేశారన్నారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా కర్నూలుకు ఉచిత బస్సు సర్వీసు ఏర్పాటు పల్నాడు, ప్రకాశం, కర్నూల్ జిల్లా వాసులకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే యరపతినేని సర్వీసు పునరుద్ధరణకు ఆర్టీసీ అధికారులతో సంప్రదించి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు అడపా శ్రీనివాసరావు, శరమాళ్ళ హనుమంతరావు, జనసేన నాయకుడు కటకం అంకారావు తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ కు సంబంధించి 2 అర్జీలు దాఖలు జరిగిందని రెవిన్యూ శాఖ తెలిపింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.