నారద వర్తమాన సమాచారం
అటవీ ప్రాంతంలో భారీ గోడౌన్ – వెలుగులోకి ‘రేషన్’ మోసం
రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్కు తరలిస్తున్న ముఠా – గోడౌన్లో వందలాది బియ్యం బస్తాలు, వేయింగ్ మిషన్లు స్వాధీనం
బెస్ట్ రైస్, అన్నపూర్ణ రైస్, మ్యాంగో రైస్. బియ్యం బస్తాల మీద ఈ పేర్లను చూసి ఇవేవో పెద్ద బ్రాండ్లకు సంబంధించిన బియ్యం అనుకునేరు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇవి అన్నమ్యయ జిల్లా రాజంపేట ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో లభించే బియ్యం. వీటిని మంచిగా పాలిష్ చేసి తూకంలో ఒక కిలో ఎక్కువ వేసి రంగురంగుల పేర్లతో బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. పేదల కోసం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని, పాలిష్ పట్టి వివిధ బ్రాండ్లతో బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టైంది.
అన్నమయ్య జిల్లా రాజంపేట అటవీ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఘరానా మోసం ఇది. ప్రభుత్వం పేదల కోసం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యాన్ని కొందరు అక్రమార్కులు పాలిష్ పట్టి వివిధ బ్రాండ్లతో బహిరంగ మార్కెట్కు తరలించడం జరుగుతోంది. అటవీ ప్రాంతంలో బియ్యాన్ని సరఫరా చేసేందుకు గోడౌన్, తూకం వేసేందుకు వేయింగ్ మిషన్లు, లైటింగ్ కోసం జనరేటర్ సౌకర్యం, బియ్యాన్ని నింపడం కోసం వివిధ బ్రాండ్లతో ముద్రించిన బస్తాలు అక్కడ దర్శనమిచ్చాయి.
అంతేకాకుండా వందలాది బియ్యం బస్తాలు గోడౌన్లో ఉండటం వెలుగుచూసింది. అన్నమయ్య జిల్లా రాజంపేట పుల్లంపేట మండలం సమీపంలోని ఉడుంవారిపల్లి అటవీ ప్రాంతంలో ప్రభుత్వ రేషన్ దుకాణంలోని బియ్యాన్ని బహిరంగ మార్కెట్కు తరలించే ముఠా కార్యకలాపాలు బట్టబయలు అయ్యాయి. కొందరు అక్రమార్కులు ఉడుంవారిపల్లి అటవీ ప్రాంతంలో ఎవరికీ అనుమానం రాకుండా ఒక గోడౌన్ ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ రేషన్ దుకాణాల నుంచి బియ్యాన్ని అక్కడికి తీసుకెళ్లి, వాటికి పాలిష్ పట్టి వివిధ రకాల బ్రాండ్లతో బహిరంగ మార్కెట్కు తరలిస్తుండటం జరుగుతుంది. గోడౌన్లో అందుకు తగ్గ భారీ సెటప్ బయటపడింది. గోడౌన్లో వేయింగ్ మిషన్లు, జనరేటర్లు, వివిధ రకాల బ్రాండ్లతో ముద్రించిన బియ్యం బస్తాలు అక్కడ కనిపించాయి. వీటితోపాటు వివిధ రకాల బ్రాండ్లతో రవాణాకు సిద్ధంగా ఉంచిన వందలాది బియ్యం బస్తాలు ఆ గోడౌన్లో దర్శనమిచ్చాయి.
అర్ధరాత్రి సమయంలో లారీల ద్వారా బియ్యాన్ని కర్ణాటకకు తరలిస్తున్న నేపథ్యంలో, ఉడుంవారిపల్లి ప్రాంతంలో లారీలు బురదలో ఇరుక్కుపోయాయి. దీంతో ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ సిబ్బంది ఇరుక్కున్న లారీని స్వాధీనం చేసుకుని ఆరా తీశారు. చివరికి అడవిలో ఒక గోడౌన్ కనుగొన్నారు. గోడౌన్లో వందలాది బియ్యం బస్తాలు, వేయింగ్ మిషన్లు, జనరేటర్, వివిధ రకాల పేర్లతో ముద్రించిన బస్తాలు, రవాణాకు సిద్ధంగా ఉంచిన బస్తాలు భారీగా అక్కడ కనిపించాయి. గోడౌన్లో రవాణాకు సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేప్టట్టారు
“మాకు వచ్చిన సమాచారం ప్రకారం, మేము వచ్చి ఇక్కడ తనిఖీ చేశాం. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుని బియ్యం స్టోర్ చేసినట్లు తెలిసింది. వీటిపైన రిపోర్టు రాసి జాయింట్ కలెక్టర్కి సమర్పించడం జరుగుతుంది. అదే విధంగా ఈ బియ్యాన్ని రాజంపేట ఎంఎల్ఎస్ పాయింట్కి తరలిస్తాము”. – జి. రవికుమార్, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్
Discover more from
Subscribe to get the latest posts sent to your email.