నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లా నూతన కలెక్టర్ కృత్తికా శుక్ల ను మర్యాదపూర్వకంగా కలిసిన పలు సంఘాల నేతలు
నరసరావుపేట
ఇటీవల పల్నాడు జిల్లా నూతన
కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ గా బాధ్యతలు చేపట్టిన
కృత్తికా శుక్లాను
దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం నరసరావుపేట లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని మరియు పూల బొకె ను ఆమెకు అందజేసి శుభాకాంక్షలను తెలియజేసిన
దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు
రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్,
శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు గురజాల అప్పారావు, హెచ్ టివి న్యూస్ అధినేత మెట్రో శ్యామ్ తెలియజేశారు.
ఈ సందర్భంగా కుక్కముడి ప్రసాద్ ఆమెతో మాట్లాడుతూ ప్రధానంగా పల్నాడు జిల్లాలోని పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలని అర్హులైన నిరుపేదలకు ఇండ్ల స్థలములు మంజూరు చేయాలని జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను అమలు చేసే విధంగా ప్రతి నెల చివరి రోజున మండలాల లోని గ్రామాలలో పౌరహక్కుల దినోత్సవాన్ని జరిపించేలా చూడాలని ఆమెను కోరారు.
ఈ విషయాలపై సానుకూలంగా వెంటనే కలెక్టర్ స్పందించి సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తానని అన్నారు.
శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గురజాల అప్పారావు
కవులకు రచయితలకు వీరనాట్యం కళాకారులకు ఐడి కార్డులు ఇచ్చు లాగున జీవో మంజూరు చేసే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతూ కలెక్టర్ కు అర్జీ ఇచ్చారు. అనంతరం పల్నాడు చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని ఆమెకు అందజేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.