నారద వర్తమాన సమాచారం
పల్నాడు జిల్లాకు మహాకవి గుర్రం జాషువా పేరు నామకరణం చేయాలి,—- దళిత ప్రజాసంఘాలు విజ్ఞప్తి
పల్నాడు జిల్లాకు మహాకవి గుర్రం జాషువా పేరు పెట్టాలని ప్రజా సంఘాల నాయకులు మహాకవి గుర్రం జాషువా 130 వ జయంతి సందర్భంగా ఆదివారం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని కవి రచయిత సాహితికారుడు గుర్రం జాషువా 130 వ జయంతి కార్యక్రమాన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా
దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు కుక్కమూడి ప్రసాద్ మాట్లాడుతూ ఆధునిక తెలుగు కవులలో పేరు ప్రఖ్యాకులుగాంచిన తెలుగు సుప్రసిద్ధత కవి నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ మహాకవి గుర్రం జాషువా అని తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలను దేశానికి చాటిచెప్పిన కవి గుర్రం జాషువా సమాజంలోని అసమానతలను అంటరానితనాన్ని కుల నిర్మూలనను నిర్మూలించడానికి కవిత్వాన్ని ఆయుధంగా చేసుకొని సమాజాన్ని మేల్కొల్పిన విశ్వ నరుడు మహాకవి గుర్రం జాషువా అని అన్నారు.
దళిత బహుజన బీమ్ సేన రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు జార్జి మాట్లాడుతూ గుర్రం జాషువా పల్నాడు జిల్లాలోని చాత్రగడ్డపాడు లో 1895లో జన్మించారని అనేక రచనలను రచించి తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి తెలుగు జాతి ఔన్నత్యాన్ని చాటు చెప్పిన పద్మభూషణ్ మహాకవి గుర్రం జాషువా అని అన్నారు.
శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు గురజాల అప్పారావు మాట్లాడుతూ గుర్రం జాషువా జయంతి కార్యక్రమం జరుపుకోవడం గర్వంగా ఉందని ఆయన యొక్క ఆశయాలను యువత స్పూర్తిగా తీసుకోవాలన్నారు.
బీసీ సంఘం మాచర్ల నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు కొరదల జ్యోతి మాట్లాడుతూ గుర్రం జాషువా కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆయన యొక్క కవిత్వం ప్రజలను మేల్కొల్పే విధంగా ఉందన్నారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జమ్మలమడక మాజీ ఎంపీటీసీ పరిమళ రాజారావు
రజక వృత్తిదారుల సంఘం డివిజన్ కార్యదర్శి బొడ్డుపల్లి ఈశ్వరయ్య ,ఇరువంటి శ్రీనివాసులు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.