నారద వర్తమాన సమాచారం
పరిశ్రమల అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేయండి : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
నరసరావు పేట,
జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అందించిన భూముల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నష్టాల్లో నడుస్తున్న పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి సాయం అందించగలిగే అవకాశాలను అన్వేషించాలన్నారు.
స్థానిక కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ వీడియో కాన్ఫరెన్ హాలులో పరిశ్రమల శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. రెండు శాఖల సిబ్బంది, కార్యక్రమాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మార్కెట్ లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంపై నైపుణ్యాభివృద్ధి శాఖ దృష్టి సారించాలన్నారు. శిక్షణ పొందిన అభ్యర్థు లందరికీ 100% ప్లేస్‌మెంట్ దక్కేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, ఎల్.డి.ఎం రాంప్రసాద్, డి ఆర్.డి.ఏ అసిస్టెంట్ పీడీ ఆర్ ప్రతాప్, జిల్లా పరిశ్రమల అధికారి నవీన్, జె.డ్.ఎం. ఏ.పీ.ఐ.ఐ.సీ డాక్టర్.ఎల్.ఎం. నరసింహారావు, జిల్లా అదనపు నైపుణ్య అభివృద్ధి అధికారి రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.