నారద వర్తమాన సమాచారం
స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర బహుమతుల ప్రధానోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల
అక్టోబర్ 4: —–
ఈ నెల 6వ తేదీన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర బహుమతుల ప్రధానోత్సవం ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 6 వ తేదీన జిల్లా నరసరావుపేట లోని టౌన్ హాలులో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్నీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులంతా సమన్వయంతో సజావుగా నిర్వహించాలన్నారు.
వేదిక అలంకరణ, సీటింగ్ ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు బహుమతి గ్రహీతతో పాటు ప్రజాప్రతినిధులందరిని ఆహ్వానించాలన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అందరినీ భాగస్వాములు చేయాలన్నారు.
అన్ని ఏర్పాట్లు ఈ నెల 5వ తేదీ కల్లా పూర్తి చేయాలన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.