నారద వర్తమాన సమాచారం
ఆర్టీఐ రక్షక్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాపోలు లింగస్వామి నియామకం
సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తామని వ్యాఖ్య
ఆర్టీఐ (సమాచార హక్కు) చట్టంపై అవగాహన పెంచేందుకు పని చేస్తున్న ‘ఆర్టీఐ రక్షక్’ సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాపోలు లింగస్వామిని నియమించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్టీఐ సతీష్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగస్వామి చట్టంపై మంచి అవగాహన కలిగిన వ్యక్తి. రాష్ట్రవ్యాప్తంగా కమిటీల ఏర్పాటు, సభ్యుల సమన్వయ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారని విశ్వాసం ఉందని తెలిపారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాపోలు లింగస్వామి విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ
2005లో అమలులోకి వచ్చిన ఆర్టీఐ చట్టం, పారదర్శక పాలనకు పునాది. అయితే చాలచోట్ల అధికారులు ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. సమాచారాన్ని ఇవ్వడంలో ఆలస్యం, తప్పుడు కారణాలతో తిరస్కరణలు వస్తున్నాయి. ఇది ప్రజలలో నిస్పృహ కలిగిస్తోందన్నారు.
ప్రజలందరికీ RTI చట్టంపై సరైన అవగాహన కలిగేలా సంస్థ తరఫున కార్యకర్తలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపడతాం. ప్రజలు తమ హక్కులపై ప్రశ్నించాలి. అధికార వ్యవస్థపై భయపడకుండా సమాచారం అడిగే స్థితికి రావాలని కోరారు. అలాగే నా నియామకానికి సహకరించిన ఆర్టీఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్టీఐ సతీష్,ఆర్టీఐ రక్షక్ సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.