నారద వర్తమాన సమాచారం
షాద్ నగర్ లో అక్రమ నిర్మాణాలు ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్న మున్సిపాలిటీ…..
మున్సిపాలిటీ చెప్పినా డోంట్ కేర్..!
షాద్ నగర్ లో పట్టపగలే అక్రమ భవన నిర్మాణం
నేషనల్ హైవే కు పక్కనే మూడంతస్తుల నిర్మాణం
అయినా మున్సిపాలిటీకి కనిపించని వైనం
మొదటి”సారి” నోటీసులు ఇచ్చిన ఆగని భవన నిర్మాణం
రెండో “సారి” నోటీస్ సేమ్ టూ సేమ్
బిఆర్ఎస్ హయాంలో అలా.. కాంగ్రెస్ హయాంలో ఇలా.. ఇలాగైతే ఎలా..?
మున్సిపాలిటీ తీరుపై వెల్లువెత్తుతున్నన్ని విమర్శలు..
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ మున్సిపాలిటీలో అధికారి సిబ్బంది తీరు విమర్శలకు తావిస్తుంది. పట్టపగలే ఒక రెస్టారెంట్ పక్కన నేషనల్ హైవేకు మూడంతస్తుల భవనాన్ని ఇలాంటి ప్రభుత్వాలు మతి లేకుండా నిర్మిస్తుంటే మున్సిపాలిటీ కమిషనర్ సునీతా రెడ్డి తదితర సిబ్బంది కల్లప్పగించి చూస్తున్నారు. పట్టణంలోని నేషనల్ హైవే 44 బైపాస్ రోడ్డు పక్కన ఉన్న యుమ్మి హోటల్ అనుకొని మూడు అంతస్తుల భవనం నడికుడ భార్గవి పేరిట నిర్మాణం అవుతుంది. అయితే మున్సిపాలిటీ నుండి ఈ భవనానికి ఎలాంటి అనుమతి లేదు. అసలు నాలా కన్వర్షన్ అయిందా కాలేదా కూడా ఎవరికి తెలియదు. అయినప్పటికీ దర్జాగా పెద్ద ఎత్తున భవన నిర్మాణం అక్రమంగా జరుగుతుంది. మున్సిపాలిటీ దీనిపై విమర్శలు ఆరోపణలు వచ్చినప్పుడు ఓసారి నోటీసు ఇచ్చి చేతులు దులుపుకుంది. ఆ తర్వాత యధావిధిగా భవన నిర్మాణం పనులు కొనసాగుతూనే ఉన్నాయి. అదేవిధంగా మళ్లీ ఆరోపణలు తలెత్తాక మున్సిపాలిటీ అధికారులు రెండోసారి నోటీసులు ఇచ్చారు. అయితే ఈసారి కూడా భవన యజమాని ఐ డోంట్ కేర్ అంటూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ దాదాపు భవనాన్ని పూర్తిగా నిర్మిస్తున్నారు. దొంగచాటుగా పట్టపగలు అక్రమ నిర్మాణం జరుగుతుంటే అది కూడా మున్సిపాలిటీ కార్యాలయానికి కూత వేటు దూరంలో జరుగుతుంటే మున్సిపాలిటీ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అమాయకులు ఎక్కడైనా ఇల్లు కట్టుకున్న ఇంకా ఏదైనా చేసిన వెంటనే వచ్చి బుల్డోజర్లు పెట్టి కూల్చివేతలు చేసే అధికార ఘనం ఇక్కడ నోరు మెదపకపోవడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో షాద్ నగర్ మున్సిపాలిటీలో చైర్మన్ నరేందర్ గా ఉన్నప్పుడు అక్రమ భవనాల నిర్మాణాన్ని కూల్చివేశారు. మెయిన్ రోడ్డు తో పాటు ఇంకా పలు కాలనీలలో కడుతున్న అక్రమ నిర్మాణాలను గుర్తించి విజిలెన్స్ అధికారులతో కలిసి అప్పట్లో కూల్చివేతలు నిష్పక్షపాతంగా జరిపారని ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి ఎందుకు ఈ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమ నిర్మాణాలపై షాద్ నగర్ మున్సిపాలిటీ కేంద్రంలో పెద్ద ఎత్తున కూల్చివేతలు జరిగాయి. మరి ఇప్పుడు పట్టణ నడిబొడున అందరు చూస్తుండగా అక్రమ నిర్మాణం జరుగుతుంటే కేవలం నోటీసులపై నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం బిల్డింగ్ నిర్వాహకులు యధావిధిగా నిర్మాణాన్ని చేపడుతుండడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఒకసారి నోటీసు ఇచ్చాక పనులు నిలిపివేయాలి. అదేవిధంగా అలా నిలపకుండా మళ్లీ పనులు చేపట్టారు. రెండోసారి కూడా నోటీసులు ఇచ్చాక కూడా యధావిధిగా పెద్ద ఎత్తున కార్మికులను పెట్టి బిల్డింగ్ నిర్మాణం కొనసాగుతూనే ఉంది. మున్సిపాలిటీ చెప్పిన డోర్ కేర్ అంటూ సాగిపోతున్న అక్రమ ఇంటి నిర్మాణం వెనుక ఎవరు ఉన్నారు ఎందుకు ఈ భవన అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోలేకపోతున్నారు అని ప్రజల ప్రశ్నిస్తున్నారు. నిష్పక్షపాతంగా మున్సిపాలిటీ వివరించాల్సి ఉండగా కొందరికి ఓ టైపు మరికొందరికి మరో టైపు గా వ్యవహరిస్తున్నారని ఇటీవలే పట్టణంలో ఓ బిల్డింగ్ అక్రమంగా కడుతున్నారని వెంటనే అక్కడ కూచివేతలు చేపట్టారు మరియు మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి గారికి జరుగుతుంటే కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేసేందుకు ప్రజలు సిద్ధం అవుతున్నారు. మున్సిపాలిటీ ఈ అనైతిక తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదేవిధంగా భవన నిర్మాణ అక్రమ పనులను మున్సిపాలిటీ నిలిపివేస్తుందా లేదా చూడాలి.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.