నారద వర్తమాన సమాచారం
ఆరోగ్య కేంద్రాల్లో నిత్యం వైద్య సేవలు అందాలి జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
పల్నాడు :నరసరావు పేట
జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో 24×7 వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఆదేశించారు. షిఫ్టుల వారీగా విధులు కేటాయించి స్టాఫ్ నర్సులు అన్ని వేళలా డ్యూటీలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్యారోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
వైద్య సేవలు మెరుగుపరిచేందుకు మండలాల వారీగా మెంటర్లను క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించాలన్నారు.
ఆరోగ్య కేంద్రాలు, హెల్త్ మరియు వెల్ నెస్ కేంద్రాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిర్మాణ సమస్యలు పరిష్కరించాలన్నారు. మెడికల్ ఆఫీసర్లు, కొరత ఉన్న ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టాలన్నారు. చెంచులకు ఆరోగ్య శ్రీ, జన ఆరోగ్య యోజన కార్డులు అందించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ బి.రవి, డిప్యూటీ డీఎంహెచ్ఓ పద్మావతి, డీసీహెచ్ఎస్ ప్రసూన, పంచాయతీ రాజ్ ఎస్ఈ కె. ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







