నారద వర్తమాన సమాచారం
లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పట్టాలను అందజేసిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు
పల్నాడు : నరసరావుపేట
నరసరావుపేటలో 217 మంది లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల పట్టాలను అందజేసిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా .ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు .
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ తాము 23 వ తారీఖున తప్పనిసరిగా ఇక్కడకు వచ్చి మీకు ఇళ్ల పట్టాలను ఇస్తామని మాట ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, ఇక్కడికి వచ్చామని మీ అందరికీ పట్టాలు ఇచ్చినందుకు సంతోషంగా ఉందని మీకు కూడా సంతోషంగా ఉన్నారని.. ఉన్నారా అని వారిలో ఉత్సాహం నింపారు.
ఇక్కడకు వచ్చిన కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు, మరో ఇద్దరు ప్రజా ప్రతినిధులు, ఆర్డిఓ, మున్సిపల్ అధికారి, టిడ్కో ఎస్.సి,ఈఈ లకు కూడి వచ్చిన మీ అందరికీ సొంత ఇంటి వారవు తున్నందుకు తెలుపు తున్నానని శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు.
ఎన్నో టిడ్కో ఇల్లు తాను చూశానని, కానీ ఇంత చక్కగా ఇన్ని వసతులతో కూడిన ఇళ్లను ఇక్కడే చూస్తున్నాను, ఇక్కడ అన్ని వసతులు అను కూలంగా ఉన్నాయని, మరుగుదొడ్లు, మురుగు కాలవలు, తాగునీరు, వాటర్ ట్యాంక్, ఇక్కడ ఎమ్మెల్యే, ఇక్కడే మున్సిపల్ కమిషనర్, ఆర్డిఓ, టిడ్కోగృహ అధికారులు ఎంతో కష్టపడి పనిచేశారని,పోలీసులు, విద్యుత్ శాఖ,తాగునీటి వసతి సౌకర్యాలు అన్నీ వచ్చాయని జిల్లా కలెక్టర్ తెలిపారు .
అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఇల్లు ఇచ్చిన అందరూ ఇక్కడ వచ్చి ఉంటే ఇక్కడకు అంగన్ వాడి స్కూలు,పిల్లల కోసం స్కూలు, ఆసుపత్రి అన్నీ ఇక్కడికే వస్తాయని తెలిపారు.ఇంకా కోర్ట్ కేసులో పెండింగ్ లో గృహాలను త్వరితగతిన వాడుకలోకి తీసుకురావాలి మున్సిపల్ కమిషనర్ ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధులత,మున్సిపల్ కమిషనర్ యశ్వంతరావు, టిడ్కో అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







