నారద వర్తమాన సమాచారం
విద్యుత్ శాఖ నోటీసులు అందజేత.. బకాయిలు చెల్లింపుకు అంగీకారం
దాచేపల్లి నగర పంచాయతీ కమీషనర్, ఎంపీడీవో లను కలసి పట్టణంలో బకాయిలు సుమారు 6 కోట్లు రూపాయలు, పంచాయితీ వాటర్ వర్క్స్, వీధి దీపాలకు సంబంధించి సుమారు 6 కోట్ల 10 లక్షలు చెల్లించవలసిందిగా శనివారం నోటీసుల జారీ జరిగిందని విద్యుత్ ఉన్నత అధికారులు తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కేటాయించిన నేపద్యంలో 15 శాతం విద్యుత్ బిల్లులు చెల్లింపుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ జరిగిందని అన్నారు. స్పందించిన అధికారులు బకాయిలను చెల్లిస్తామని అంగీకరించారని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈ ఈ వీరేశ్వర రావు, ఏ ఏ ఓ సందీప్ కుమార్, జే ఏ ఓ ఆశీర్వాదం, ఏఈ భగవాన్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







