నారద వర్తమాన
నష్టపరిహారం నివేదికలు సిద్ధం చేయాలి*టెలికాన్ఫిరెన్స్ ద్వారా అన్ని శాఖల అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
మొంథా తుఫాను నష్టపరిహారం నివేదికలు త్వరితగతిన సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
పేర్కొన్నారు, గురువారం స్థానిక కలెక్టరేట్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా తుఫాను నష్ట గణన ప్రక్రియ అంశంపై జిల్లాలోని అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను బాధితులకు నష్టపరిహారం అందించడంలో అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్రంగా విచారణ జరిపి సంబంధిత రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో పరిశీలన జరిపి వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు, నివేదికల సిద్ధం చేసినచో ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి నిధులు మంజూరు చేయడానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు, విద్యుత్ శాఖ, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖ, వ్యవసాయ, ఉద్యానవని శాఖ అధికారులు సమగ్ర రిపోర్ట్ అందజేయాలని ఆదేశించారు, జిల్లా నిధుల నుండి కూడా మొంథా తుఫాను బాధితులకు నష్టపరిహారం అందజేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని వివరించారు. తుఫాన్ వలన నష్టపోయిన గృహాలు తప్పులు లేకుండా నివేదికలు అందజేయాలని, ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో ఎన్ని కల్వర్టులు దెబ్బతిన్నాయి, నివేదికల సిద్ధం చేయాలని, ఇరిగేషన్ ఆధ్వర్యంలో ఎన్ని చెరువులు , మరమత్తు పనులు చేపట్టాలో ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో ఎన్ని రోడ్లు మరమత్తు పనులు చేపట్టాలో, విద్యుత్ శాఖ వలన ఎంత మేర నష్టం జరిగిందో, పశుసంవర్ధక, పంటలు ఎంత నష్టం జరిగిందో, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏ ఏ మండలాలలో ఎంత నష్టం జరిగిందో నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు, ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని శాఖలు అధికారులు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







