నారద వర్తమాన సమాచారం
ఐ బొమ్మ రవి కేసు వాదించే లాయర్ కు పాలాభిషేకం చేస్తామంటున్న నెటిజన్లు!
దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ విసిరిన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసి అతనిని విచారణ చేస్తున్నారు. ఐ బొమ్మ, బప్పం టీవీతో పాటు 65కు పైగా పైరసీ వెబ్సైట్లను పోలీసులు బ్లాక్ చేశారు. పైరసీకి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు ఒకపక్క కృషి చేస్తుంటే మరోపక్క సోషల్ మీడియాలో ఇమ్మడి రవికి మద్దతు పెరుగుతుంది.
రవి కేసును వాదిస్తున్న జగన్ కోడికత్తి కేసు లాయర్
ఈ క్రమంలోనే ఏపీలో సంచలనం సృష్టించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కోడి కత్తి, గులకరాయి కేసుల్లో నిందితులకు బెయిల్ ఇప్పించిన న్యాయవాది సలీం ఇప్పుడు ఐ బొమ్మ రవి కేసును స్వీకరించారు. చట్టప్రకారం రవిని అరెస్ట్ చేసినట్టే, అదే చట్టం ప్రకారం నిందితుడి తరపున వాదనలు వాదించడం కోసం తాను ముందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. రవి తల్లిదండ్రులతో తాను మాట్లాడానని, కేసులో అతని తరుపున వాదిస్తానని పేర్కొన్నారు.
నిందితుడి హక్కుల కోసం వాదిస్తా
నిందితుడి హక్కుల కోసం తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తానని ఇమ్మడి రవి తెలిపారు.ఇక పోలీసులు హీరోలుగా నిలబడాలంటే, విలన్ కూడా అంతే ధైర్యంగా ఉండాలని పేర్కొన్న సలీం, అలాంటి విలన్ కు డేరింగ్ అండ్ డాషింగ్ లాయర్ దొరికితే ఎలా ఉంటుందో చూపిస్తానని వ్యాఖ్యలు చేశారు.
సులభంగా బెయిల్ వస్తుంది
ఇమ్మడి రవిని అరెస్టు చేసినందుకు సినీ ప్రముఖులు, పోలీసులకు కృతజ్ఞతలు చెప్పినట్టుగా ఈ కేసును వాదిస్తున్న అందుకు తనకు పాలాభిషేకం చేస్తామని మెసేజ్ లు చేస్తున్నారని లాయర్ సలీం పేర్కొన్నారు. రవి కేసు చాలా సులభమని, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదని సలీం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పెట్టిన సైబర్ క్రైమ్ కేసులో సులభంగా బెయిల్ వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
రవి మా దేవుడు అంటున్న నెటిజన్లు
ఇమ్మడి రవి పైరసీ చేసి తప్పు చేశాడు అయినప్పటికీ ప్రజలు అతనికి మద్దతుగా నిలుస్తున్నారన్నారు. అతడిని హీరోగా చూస్తున్నారని, దాని కారణంగానే ఈ కేసుకు ఇంత హైప్ వచ్చిందని రవి తరపున వాదిస్తున్న లాయర్ తెలిపాడు. రవి మా దేవుడు ఈ కేస్ తీసుకుని గొప్ప పని చేశారు థాంక్యూ… అంటూ చాలామంది తనను ప్రశంసిస్తున్నారు అన్నారు.
బెయిల్ పిటీషన్ దాఖలు చేశా
ఇప్పటికే రవికి బెయిల్ ఇవ్వాలని బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్టు పేర్కొన్నారు. ఇక కోడి కత్తి కేసు వాదించిన లాయర్ ఐ బొమ్మ రవి కేసు స్వీకరించడంతో ఇప్పుడు ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందో అన్న చర్చ జరుగుతుంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







