నారద వర్తమాన సమాచారం
చెస్ గేమ్ లో ప్రథమ స్థానం పొందిన గురజాల దీక్షిత్
మాచర్ల :
పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల అందిస్తున్న సేవలు అభినందనీయమని కెసిపి ప్లాంట్ జనరల్ మేనేజర్ వి వెంకటరమణ అన్నారు.
రోటరీ క్లబ్ యువజన ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన పలు క్రీడా పోటీలలో విజేతలకు శనివారం నరిశెట్టి కళ్యాణమండపంలో బహుమతులు అందజేశారు.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై
జిఎం వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో మనించాలన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాఫోటోలో నిర్వహించడం సంతోషకరమన్నారు. రోటరీ క్లబ్ తో తమకు ఎన్నో ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉందని, ఇది చాలా దృఢమైనదని, వారు నిర్వహించే అన్ని కార్యక్రమాలలో మేము భాగస్వామ్యం కలిగి ఉండడాన్ని చాలా గర్వంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గం లోని వివిధ పాఠశాలల 350 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులకు మెమోంటోలు అందించారు.
ప్రత్యేక అతిథిగా పాల్గొన్న జిల్లా 31 50 అవార్డు కమిటీ చైర్మన్ పంగులూరి విష్ణు బాబు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం చెస్ పోటీలలో ప్రథమ స్థానాన్ని సాధించిన జెనిత్ పాఠశాల విద్యార్థి గురజాల దీక్షిత్ ను ఘనంగా అభినందించారు.
కార్యక్రమంలో కమిషనర్ ధూళిపాళ్ల వేణుబాబు, కాలంగి నాగేశ్వరరావు, వై వెంకట్రామయ్య, తుమ్మల సత్యప్రసాద్, ఆలేటి కోటేశ్వరరావు, తిర్లిక శ్రీనివాసరావు, ఈవో సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







