నారద వర్తమాన సమాచారం
పల్నాటి వీర ఆరాధన ఉత్సవాల్లో పాల్గొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి….
కులమతాలకు అతీతంగా బ్రహ్మనాయుడు ఏర్పాటుచేసిన చాపకూటి (సహపంక్తి భోజనాలు) ను కొనసాగించాల్సిన బాధ్యత పల్నాటి ప్రాంత ప్రజల పై ఉందని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. శుక్రవారం పల్నాటి వీరారాధనోత్సవాలలో భాగంగా మందపోరు రోజున చాపకూటి కార్యక్రమం వీర్ల దేవాలయంలోని చాపకుడు మండపంలో జరిగింది. వీర్ల దేవాలయంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు,నరసరావుపేట శాసనసభ్యులు అరవిందబాబు, గురజాల డి.ఎస్.పి జగదీష్, గురజాల ఆర్డీవో మురళీకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. ఆనాడు బ్రహ్మనాయుడు ఉపయోగించిన ఖడ్గాని పరిశీలించారు. ఈ సందర్భంగా జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ అగ్రవర్ణాలను ఆలయ ప్రవేశం చేయించి మాల కన్నమదాసును సర్వసైన్యధ్యక్షుడిగా చేశారన్నారు. బ్రహ్మనాయుడు మానవతావాది సాంఘిక విప్లవాదన్నారు. ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను నేటికీ అమలవుతూనే ఉన్నాయి అన్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పల్నాటి ఉత్సవాలను, పల్నాటి చరిత్ర, చిహ్నాలను దేశ నలుమూలల తెలిసే విధంగా నిర్వహించాలని అన్నారు అని ఆమె తెలియజేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రపంచంలోనే దైవాలకు పూజలు చేయటం రోమ్ నగరంలో చేస్తారని, తరువాత దైవాలకు పూజలు చేయడం కారంపూడిలో మాత్రమే జరుగుతుందన్నారు. కారంపూడి ఎస్సై వాసు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ అయ్యవారు, తహసిల్దార్ వెంకటేశ్వర నాయక్, ఎంపీడీవో గంటా శ్రీనివాసరెడ్డి,టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంగులూరి అంజయ్య, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి పంగులూరి పుల్లయ్య, టిడిపి సీనియర్ నాయకులు బోల్నెడి శ్రీనివాసరావు, కారంపూడి మండలం పార్టీ అధ్యక్షులు గోళ్ళ సురేష్ యాదవ్, టిడిపి పట్టణ అధ్యక్షులు బొమ్మిన శేషగిరి, టిడిపి సీనియర్ నాయకులు మునుగోటి సత్యం, చప్పిడి రాము, ఉన్నం లక్ష్మీనారాయణ, సర్పంచ్ బానవత్ సరస్వతి బాలు నాయక్, కటికల బాలకృష్ణ, తండ మస్తాన్ జానీ, ఎస్ పి ఆర్ కృష్ణ, పూర్ణయ్య, కర్నాటి మహేష్, తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







