నారద వర్తమాన సమాచారం
కుజదోషం నుంచి బయటపడే సులువు మార్గాలు..
జ్యోతిష శాస్త్రంలో కుజుడు (అంగారకుడు) బలహీనంగా ఉంటే లేదా దోష స్థితిలో ఉంటే దాన్ని “కుజదోషం” అంటారు. ఈ దోషం వల్ల వైవాహిక జీవితంలో ఆలస్యం, గృహంలో కలహాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య ఇబ్బందులు వంటివి ఎదురవుతాయని నమ్మకం. అయితే ఈ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రాచీన జ్యోతిష్యులు, పండితులు కొన్ని సరళమైన ఉపాయాలను సూచించారు. వీటిని శ్రద్ధతో పాటిస్తే కుజుడి కోపం శాంతించి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.
కుజుడిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత శక్తివంతమైన మంత్రంగా అంగారక గాయత్రి మంత్రాన్ని భావిస్తారు. “ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి.. తన్నో అంగారకః ప్రచోదయాత్” అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం 11 లేదా 21 సార్లు జపిస్తే కుజదోషం క్రమంగా తగ్గుతుందని పెద్దలు జ్యోతిష్యులు చెప్తున్నారు మంగళవారం రోజున ఈ జపం చేయడం వల్ల ఫలితం మరింత త్వరగా కలుగుతుంది.
కుజదోష నివారణలో హనుమాన్ ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. రోజూ క్రమం తప్పకుండా హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కుజుడి ప్రతికూల శక్తి తొలగి ధైర్య స్థైర్యాలు పెరుగుతాయి. ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజుల్లో సాయంత్రం దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చదవడం అత్యంత శ్రేష్ఠమైన పరిహారంగా జ్యోతిష్యులు చెప్తున్నారు
ఇక సమీపంలోని సుబ్రహ్మణ్యస్వామి (మురుగన్ / కార్తికేయ) ఆలయానికి మంగళవారం వెళ్లి ప్రత్యేక పూజలు చేయించడం, అక్కడ గారెలు, బూరెలు, పంచమృతాలు సమర్పించడం, అన్నదానం చేయడం లాంటి దానధర్మాలు చేస్తే కుజదోషం బాగా తగ్గుతుందని పెద్దలు చెబుతుంటారు. అదే రోజున హనుమంతుడికి సిందూరం, ఆకుపచ్చని చీర లేదా ఆకుపచ్చ గుడ్డ సమర్పించి పూజ చేయడం వల్ల రెట్టింపు ఫలితం వస్తుంది. ఈ ఉపాయాలను నియమ నిష్ఠలతో 21, 40 లేదా 48 రోజుల పాటు కొనసాగిస్తే కుజుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







