Wednesday, December 3, 2025

భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు,

నారద వర్తమాన సమాచారం

భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన పల్నాడు జిల్లా పోలీసులు,

ఈ రోజు (నవంబర్ 26 వ తేదీ) దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా, పల్నాడు జిల్లా పోలీస్‌ విభాగం తరపున జిల్లా పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)  జె వి .సంతోష్  అదనపు ఎస్పీ (ఏఆర్) సత్తిరాజు  ఇతర పోలీస్ అధికారులు పాల్గొని భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి, మహామేధావి, సామాజిక న్యాయ సమరయోధుడు డా. బి.ఆర్. అంబేద్కర్  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

అదనపు ఎస్పీ (అడ్మిన్) మాట్లాడుతూ…

అచంచలమైన కృషి, అపారమైన జ్ఞానం, దూరదృష్టి మరియు సమానత్వం పట్ల నిలకడైన నిబద్ధతతో డా. బి.ఆర్. అంబేద్కర్ గారు రూపొందించిన భారత రాజ్యాంగం, ప్రపంచంలో అత్యుత్తమ ప్రజాస్వామిక రాజ్యాంగాలలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు.

1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించబడిన రోజు గుర్తుగా ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవం నిర్వహించబడుతున్నదని తెలిపారు.

రాజ్యాంగం కేవలం చట్టపరమైన పుస్తకం మాత్రమే కాకుండా, దేశ పరిపాలనకు మార్గదర్శక గ్రంథమని, ప్రతి పౌరుడు పాటించాల్సిన విలువలు, హక్కులు మరియు బాధ్యతలు ఈ గ్రంథంలో పొందుపరచబడ్డాయని వివరించారు.

భారత రాజ్యాంగాన్ని దృఢమైన, సమగ్ర, సమాన హక్కులను కలిగించిన గ్రంథంగా తీర్చిదిద్దడంలో అంబేద్కర్  కృషి ఎనలేనిదని, ఆయన దూరదృష్టి, సామాజిక న్యాయం పట్ల నిబద్ధత అపూర్వమని అన్నారు.

ప్రతి పోలీస్ అధికారి మరియు సిబ్బంది రాజ్యాంగ పరిరక్షణలో ముందుండాలని, పౌరుల హక్కులను కాపాడేందుకు న్యాయం, సమానత్వం, నిబద్ధత వంటి రాజ్యాంగ విలువలను పోలీసింగ్‌లో ప్రతిబింబించాలి అని కోరారు.

రాజ్యాంగ ప్రమాణ స్వీకారం

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ(AR) సత్తిరాజు  హాజరైన అధికారులు మరియు సిబ్బందితో రాజ్యాంగ ప్రమాణ స్వీకారం కార్యక్రమం నిర్వహించారు.ఈ
ప్రమాణంలో— రాజ్యాంగాన్ని గౌరవించడం, పౌరుల హక్కులను కాపాడడం, నిష్ఠ, న్యాయం, సమానత్వం, దేశాభివృద్ధి పట్ల కట్టుబడి పనిచేయడం వంటి అంశాలు పునరుద్ఘాటించబడ్డాయి

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ గార్లతో పాటు RI లు, ఇతర పోలీస్ అధికారులు మరియు సిబ్బంది
పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading