నారద వర్తమాన సమాచారం
స్వామి వివేకానంద & నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల ప్రచార పోస్టర్ ఆవిష్కరించిన తెలుగు వెలుగు సాహితి వేదిక వారు……
తెలంగాణ
తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో జనవరి
2026న నిర్వహించనున్న స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాల ప్రచార పోస్టర్ ను కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యులు,సోషల్ సైన్సెస్ డీన్ ఆచార్య బి సురేష్ లాల్ తెలుగు వెలుగు సాహితీ వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పొడిచెట్టి విష్ణువర్ధన్ తో కలిసి ఆవిష్కరించారు. గురువారం విశ్వవిద్యాలయంలోని అర్ధశాస్త్ర విభాగంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా సురేష్ లాల్ మాట్లాడుతూ తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద,సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించాలనే సంకల్పం గొప్పదన్నారు. సంస్థ ఆధ్వర్యంలో పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు వెలుగు సాహితీ వేదిక చైర్మన్ పోలోజు రాజ్ కుమార్,బంగారు నంది అవార్డు గ్రహీత డాక్టర్ వేముల తిరుపతి రెడ్డి, మీడియా కో ఆర్డినేటర్ జోనగోని యాదగిరి గౌడ్,డాక్టర్ సుద్దాల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







