నారద వర్తమాన సమాచారం
20 కి చేరిన చత్తీస్ ఘడ్ మృతుల సంఖ్య?
ములుగు జిల్లా:
బీజాపూర్ దంత్యవాడ సమీపంలో ఉదయం నుంచి ఇప్పటివరకు ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి, 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుం ది,ఈ ఎన్కౌంటర్లో ఎక్కువ మంది మావోయిస్టులు మృతి చెందే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తుంది, ఉదయం ఐదుగురు ఎన్కౌంటర్లో మృతి చెందగా..
బుధవారం రాత్రి 8 గంటల సమయం వరకు 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా పోలీసు అధికార వర్గాలు వెల్లడిం చాయి.భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటికే ముగ్గురు జవాన్లు మృతి చెందారు.మరోవైపు.. ఇటీవల ఏపీలో హిడ్మాను ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది.
హిడ్మాది పూర్తిగా భూ టకపు ఎన్కౌంటర్ అని మావోయిస్టు పార్టీ ఆరోపించింది..దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరుతో లేఖ విడుదలైంది. “హిడ్మాతో పాటు శంకర్లను పట్టుకుని చిత్ర హింసలు పెట్టి చంపేశారు.. ఏపీకి చెందిన కొందరు కలప వ్యాపారుల ద్రోహం వల్లనే వీళ్ళు దొరికిపోయారు..
అనారోగ్యంతో ఉన్న హిడ్మా, శంకర్లు చికిత్స కోసం విజయవాడకు వెళ్లారు.. కలప వ్యాపారులతో కలిసి విజయవాడకు వెళితే వాళ్ళని పట్టుకున్నారు.. వారం రోజులపాటు చిత్రహింసలకు గురిచేసి ఆంధ్ర పోలీసులు చంపేశారు.. హుడ్మా, శంకర్ల ఎన్కౌంటర్ పై సమగ్ర దర్యాప్తు చేయాలి..అని లేఖలో డిమాండ్ చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







