నారద వర్తమాన సమాచారం
దొంగతనం కేసు లో ఐదుగురు ముద్దాయిలు అరెస్ట్ పాత గుంటూరు పోలీస్ స్టేషన్
పాత గుంటూరు పోలీస్ స్టేషన్
దొంగతనం కేసు లో ఐదుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసిన పాత గుంటూరు పోలీసులు,.
ఫిర్యాది ముద్రాసు సరస్వతి w/o నాగేశ్వర రావు, 35 సంవత్సరాలు, గౌడ కులం, రెడ్ల బజార్‌లో, వాసవి కాంప్లెక్స్ సమీపంలో, పాత గుంటూరు, గుంటూరు టౌన్-7794828799 అను ఆమె తన భర్తతో తనకు గొడవలు వచ్చాయని, తాను ఒంటరిగా రెడ్ల బజార్‌లో, పాత గుంటూరు, గుంటూరు టౌన్, వాసవి కాంప్లెక్స్ సమీపంలో నివసిస్తున్నానని, ఈ క్రమము లో ది.09.08.2025న రాత్రి 08.00 గంటలకు తాను ఇంటి నుండి బయటకు వెళ్లి, తిరిగి ది.10.08.2025న తెల్లవారుజామున 01.00 గంటలకు ఇంటికి తిరిగి వచ్చి, చూడగా గుర్తు తెలియని దొంగలు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి నగదు రూ.10,00,000/- మరియు బంగారు ఆభరణాలు 1) నెక్లెస్- 21 గ్రాములు, 2) బంగారం-34 గ్రాములు, 3) చెవి ఉంగరం-3 జతలు -20 గ్రాములు, 4) 4 బంగారు ఉంగరాలు-15 గ్రాములు బంగారు వస్తువులను దొంగలించినట్లు ఫిర్యాదు చేయగా, పాత గుంటూరు పోలీస్ వారు కేసు నమోదు చేసినారు.
సదరు కేసులలో అన్ని కోణాలలో క్షుణ్ణంగా దర్యాప్తు చేసి, పై ముద్దాయిల కదలికలను గమనించి, గుంటూరు జిల్లా ఎస్పి వకుల్ జిందాల్, IPS అదేశాల మేరకు ఈస్ట్ డిఎస్పి అయిన షేక్ అబ్దుల్ అజీజ్ అద్వర్యం లో పాత గుంటూరు సిఐ అయిన కే. వెంకట ప్రసాద్ ది.06.12.2025 వ తేది న గుంటూరు టౌను, సుద్దపల్లి డొంక, దుర్గానగర్ 1వ లైను ముద్దాయిలను అదుపులోనికి తీసికొని, A1) మద్దు అనిత ని విచారించగా తాను తన భర్త తో సుమారు 11 సంవత్సరాల క్రితం విడిపోయినట్లు, ఆ తరువాత ఆసుపత్రిలో ఆయాగా చేస్తూ, వచ్చే డబ్బులు సరిపోక, గుంటూరు బస్టాండ్ దగ్గర రాత్రిళ్ళు వ్యభిచారం చేస్తూ, ఆ తరువాత ఆటో డ్రైవర్ కరిముల్లా తో పరిచయం అయి, కొరిటపాడు ఏరియా నుండి ఇల్లు ఖాళీ చేసి పాత గుంటూరు, సుద్దపల్లి డొంక, దుర్గా నగర్, 1 వలైన్ లో ఉంటునట్లు, ఎలాగైనా డబ్బు సంపాదించాలి అని అందరం కలిసి తనకి తెలిసిన వ్యభిచార వృతి చేసే సరస్వతి ఇంట్లో చొరబడి నగదు రూ.10,00,000/- మరియు బంగారు ఆభరణాలు లను దొంగతం చేసి, దొంగిలించిన బంగారునగలలో హారము, మరియు నక్లెస్ లను యూనియన్ బ్యాంకు, మేడికొండూరు బ్రాంచ్ లో తాకట్టు పెట్టి 2,75, 000/- రూపాయలు తీసుకున్నాను. మిగిలిన బంగారపు వస్తువులు అనగా చెవి కమ్మలు 3 జతలు, 3 బంగారపు ఉంగరములను స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మేడికొండూరు బ్రాంచ్ లో తాకట్టు పెట్టి 2,25,000/- లు తీసుకున్నారు. ఆ తర్వాత అందరం ఆ మొత్తము ఖర్చులకు వాడుకున్నారు. ఈ రోజు పాత గుంటూరు సిఐ సిబ్బంది తో కలిసి వచ్చి వారిని పట్టుకొని వారి వద్దనుండి చోరి సొత్తు అయిన 3,50,000/- ల రూపాయలను, బంగారము తాకట్టు పెట్టిన 2 రసీదులను కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తము స్వాధీన పరచుకొని, వారిని అరెస్ట్ చేయడమైనది.
మద్దు అనిత W/O మక్కేన వెంకట మహేష్ వయస్సు: 30 సంవత్సరాలు, కులం. మాల, కొర్రపాడు గ్రామము, మేడికొండూరు మండలము ప్రస్తుతము 1 వ లైను దుర్గనగర్,సుద్దపల్లి డొంక, పాత గుంటూరు, గుంటూరు టౌన్, సెల్: 8919164647, 6281426505
షేక్ కరిముల్లా S/O మస్తాన్ వలీ, వయస్సు: 38 సం.లు, కులం. దూదేకుల, 1/8 వ లైను, యాదవ బజారు, పాత గుంటూరు, గుంటూరు టౌన్
రెడ్డి సాయి సంతోష్ S/O శివ ప్రసాద రావు , వయస్సు. 32 సం. లు. కులము తెలగ, నివాసము 8/1 వ లైను, శ్రీనగర్, గుంటూరు టౌన్, 9985372231,గండికోట గోపి S/O వీర రాఘవులు, వ. 22 సం. లు., కులము ఉప్పర, నివాసము పిచ్చుకలగుంట, 31/3 వ లైను, ఆరండల్ పేట, గుంటూరు టౌన్, 767495039,
గండికోట గోపి S/O వీర రాఘవులు, వ. 22 సం. లు., కులము ఉప్పర, నివాసము పిచ్చుకలగుంట, 31/3 వ లైను, ఆరండల్ పేట, గుంటూరు టౌన్, 767495039,
బాణవత్ చందు నాయక్ S/O సుబ్బారావు నాయక్, వ. 21 సం. లు., కులము సుగాలీ, నివాసము 8/1 వ లైను, శ్రీనగర్, గుంటూరు టౌన్. 6303020595.
పై కేసులో నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన గుంటూరు ఈస్ట్ డి.ఎస్పి అబ్దుల్ అజీజ్ ని, పాత గుంటూరు సిఐ వెంకట ప్రసాద్ ని, సిబ్బంది మోహన్, నూరుద్దీన్, రామరావు లను గుంటూరు జిల్లా ఎస్పి వకుల్ జిందాల్, IPS అభినందించినారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







