నారద వర్తమాన సమాచారం
హెచ్ ఆర్ పి డబ్ల్యు ఏ ఓ ఆధ్వర్యంలో ఘనంగా 77 వ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
మాచర్ల:-
1948 డిసెంబర్ 10 న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను ఆమోదించిన రోజును గుర్తు చేసుకుంటూ,
మానవులందరికీ ఉండే స్వేచ్ఛ సమానత్వం, గౌరవాలను గుర్తుచేస్తూ మానవ హక్కుల ఉల్లంఘన పై అవగాహన పెంచటానికి,
వాటి పరిరక్షణకు కృషి చేయటానికి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని,
ప్రతి మనిషి తమ హక్కులను తెలుసుకొని స్వేచ్ఛగా జీవించాలని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను గురించి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రెసిడెంట్ గురజాల అప్పారావు అన్నారు
77వ అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా
బుధవారం
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణం లోని
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పార్కు నందు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో
ఘనంగా నిర్వహించారు.
హెచ్ ఆర్ పి డబ్ల్యు ఏ వో ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ
స్వేచ్ఛ సమానత్వం సౌబ్రాతృత్వం ఓటు హక్కు భారత రాజ్యాంగం మనకు కల్పించినప్పటికీ ప్రతిరోజు హక్కులకు ఏదో ఒకచోట భంగం కలుగుతుందని, హక్కులకు భంగం కలిగితే మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేయాలని తెలియజేశారు. అలాగే
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకోవడం గర్వంగా ఉందని.
ప్రజలు వివిధ పనులు మీద ఆఫీసుకు వచ్చే ప్రతి పౌరుడు ని అధికారులు గౌరవించాలని, వారి హక్కులకు భంగం కలిగించవద్దని
వారి పనులను సకాలంలో పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జమ్మలమడక తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ పరిమళ రాజారావు
దళిత నాయకులు కుక్కమూడి నెహెమ్య పేరుపోగు అచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







