నారద వర్తమాన సమాచారం
పేటలో తనిఖీ భయంతో షాపులు మూసివేసిన స్వర్ణకారులు
చిలకలూరిపేట లో లీగల్ మెట్రాలజీ తపాలా మరియు కొలతలశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలకు రావడం కలకలం సృష్టించింది.
తనిఖీలకు వచ్చిన అధికారులను చూసిన పట్టణంలోని బంగారు నగల దుకాణాల యజమానులు, షాపులు మూసివేసి ఉడాయించారు. దీంతో అధికారులు సైతం షాక్ అయ్యారు.
బంగారు దుకాణాలలో వినియోగించే తూనిక యంత్రాలు త్రాసులు సరిగా పనిచేస్తున్నాయా లేదా, వాటికి సరైన ధృవీకరణ ఉందా, కొలతల్లో లోపాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించేందుకు లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు పట్టణం లో పలుచోట్ల తనిఖీలు నిర్వహించారు
అధికారులు పట్టణంలోని ప్రధాన కూడళ్లలో మరియు బజార్లలోని బంగారు షాపుల వద్దకు వెళ్లేసరికి, ఒకటి కాదు రెండు కాదు, దాదాపు అన్ని ప్రధాన బంగారు దుకాణాలు మూసి ఉండటం కనిపించింది. తనిఖీ సమాచారం ముందే తెలుసుకున్న వ్యాపారులు, భారీ జరిమానాలు మరియు కేసులు తప్పించుకునేందుకు ముందుగానే షాపులను మూసివేసినట్లు తెలుస్తోంది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







