ఆర్.ఎం.పి & .ఎం.పి వైద్యుల పై టీ. జి.ఎం.సీ దాడులు ఆపాలి
ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేసిన ఆర్.ఎం.పి, పి ఎం పి వైద్యుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు : మునీర్
మిర్యాలగూడ
నారద వర్తమాన సమాచారం
ప్రతినిధి : బంధనకంటి శంకర్
మారుమూల ప్రాంతాలైన తండాలలో, మురికివాడలలో ,గూడాలలో గ్రామీణ పేద ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటూ ప్రాథమిక వైద్యం చేస్తున్న ఆర్ఎంపి పిఎంపీ లపై, టీ జి ఎం సీ వారు చేస్తున్న దాడులను అరికట్టాలని ప్రాథమిక వైద్యం పేద ప్రజలకు అందే విధంగా గ్రామీణ వైద్యులకు ఫస్ట్ ఎయిడ్ చేసే వెసులుబాటు కల్పించాలని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మునీర్ మాట్లాడుతూ మేము డబ్బులు ఇచ్చిన ఇయ్యకున్నా, రాత్రి అనకా పగలనకా ప్రాథమిక వైద్యం చేస్తున్నాము ,మేము కూడా వారి వద్ద కాంపౌండర్లుగా ఐదు ఆరు సంవత్సరాల కు పైగా శిక్షణ పొంది వారు రాసిన మందులను ఇంజక్షన్ లను ఇస్తూ జీవనోపాధి చేస్తున్నాము. మాకు ప్రాథమిక వైద్యం చేసే వెసులుబాటు ఇవ్వాలని, ఎమ్మెల్యేను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సుశృత గ్రామీణ వైద్యుల సంఘం మిర్యాలగూడ మండల అధ్యక్షులు బందనకంటి ద్రోణాచారి, డివిజన్ అధ్యక్షులు ఎస్కే హుస్సేన్, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ ఈ వెంకన్న మండల కార్యదర్శి లక్ష్మణ్, డివిజన్ కార్యదర్శి ఉబ్బని రవి, రాష్ట్ర ఈసీ నెంబర్ ధర్మాచారి, చిన్నం రమేష్, వేణు, జానకిరాము, పులి లింగయ్య, రాము,గౌస్ పాషా, రమేష్ తదితర ఆర్ఎంపీలు పాల్గొన్నారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







