నారద వర్తమాన సమాచారం
అక్షర పల్నాడును సాకారం చేద్దాం : జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
నరసరావు పేట,
జిల్లాలోని నిరక్షరాస్యులందరితో అ ఆ లు దిద్దించి అక్షర పల్నాడు సాకారం చేద్దామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పిలుపునిచ్చారు. జిల్లాలో గుర్తించిన 1,27,565 నిరక్షరాస్యులకు తరగతులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా స్వయం సేవా సంఘాల మహిళలకు చదవడం, రాయడంతో పాటూ ఆర్థిక అక్షరాస్యత, స్వయంగా వ్యాపారం చేసుకునేందుకు అవసరమైన నైపుణ్యాలు అందించాలన్నారు.
సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అక్షర ఆంధ్ర, హరిత గోపాలం, స్వమిత్వ, గ్రామాల్లో పన్నుల సేకరణ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నియోజక వర్గానికి ఒక సామూహిక గోశాల నిర్మించేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో నియోజకవర్గానికి రూ.10 లక్షల నిధులు అందిస్తామన్నారు. అర ఎకరం స్థలంలో గోశాల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.
పశు గ్రాసం కోసం ఇబ్బందులు లేకుండా హరిత గోపాలం పథకం ద్వారా ఏడాది పాటూ గ్రాసం పెంచే విధంగా వ్యక్తిగత,సామూహిక, సంస్థాగత గడ్డి పెంపకాన్ని ప్రోత్సహించాలన్నారు.
గ్రామాల్లో ఇళ్లు, స్థలాల హద్దులు నిర్ణయించే స్వమిత్వ సర్వే వేగవంతం చేయాలన్నారు. పన్నుల సేకరణలో వెనకబడిన పంచాయతీల అధికారులనుంచి వివరణ తీసుకున్నారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది చేస్తున్న ఇతర సర్వేలను పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డ్వామా పిడి సిద్ధ లింగమూర్తి,డి.ఆర్.డి.ఎ, పి.డి ఝాన్సీ రాణి, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి వి.నాగేశ్వర నాయక్, ఐ.సి.డి.ఎస్.డి, ఎం. ఉమాదేవి,విద్యుత్ శా ఖ అధికారి విజయ్ కుమార్, ముఖ్య ప్రణాళిక అధికారిని మాలతి, సివిల్ సప్లయి మేనేజర్ నారద ముని, అడల్ట్ ఎడ్యుకేషన్ అధికారి మల్లి తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







