ఉన్నం విజయ్ భాస్కర్ ను పరామర్శించిన ఎమ్మెల్సి మంకెన కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్,రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్ధ
నారద వర్తమాన సమాచారం
మిర్యాలగూడ జనవరి 18
అధికార కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎస్సై వేధింపులు తాళలేక పాయిజన్ తీసుకున్న ఉన్నం విజయ్ భాస్కర్ మిర్యాలగూడ ప్రాంతీయ ఆసుపత్రి నందు చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యారు.. విషయం తెలుసుకున్న స్థానిక సంస్థల నల్లగొండ జిల్లా ఎమ్మెల్సి మంకెన కోటి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్, రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్ధ హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి చేరుకొని విజయ భాస్కర్ ఆరోగ్య యోగక్షేమాలు తెలుస్కోని, ఒకవేళ మెరుగైన చికిత్స అవసరం పడితే హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి మారుద్దామని ఇక్కడి వైద్యులను ఆరోగ్యం పట్ల అడిగి ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ రోజు, రోజుకి పోలిసుల అరాచకాలు ఎక్కువవుతున్నాయని కాంగ్రెస్ పార్టీ గ్రామా స్థాయి లీడర్లు ఫోన్ లో మాట్లాడిన మా పార్టీ వాళ్ళను స్టేషన్ కూ పిలిపించి బయబ్రా౦తులకు గురి చేస్తున్నారని తెలిపారు..ఇప్పుడు విజయ భాస్కర్ పరిస్థితి కుడా అంతే ఉంది, అయన మీద ఎటువంటి కేసులు లేకున్నా, రోజు స్టేషన్ కూ రమ్మని ఉదయం నుంచి సాయంత్రం దాక స్టేషన్ లో కూర్చో పెట్టి బూతులుతిడుతూ హింసిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఇటువంటి చర్యలు మానుకోవాలని హెచ్చరించారు..
కార్యక్రమములో DCCB మాజీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, సత్యపాల్,ఎండి.షోయబ్,వింజం శ్రీధర్,బొల్లేపల్లి శ్రీనివాస్, ఎల్కశెట్టి రాము, దైద సత్యం, ఉన్నం ఈశ్వర్, తుమ్మల ఫణి కుమార్ తదితరులు ఉన్నారు..
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







