వాడవాడల్లో జాతీయ జెండా
నారద వర్తమాన సమాచారం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం వాడవాడల్లో జాతీయ జెండా రెపరెపలాడింది ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌబ్రతత్వం ఉండాలని, మనుషులందరూ సమానమే అని అందరికీ ఉద్యోగ ఉపాధి విద్య వైద్యం తదితర రంగాల్లో సమాన అవకాశాలని కల్పించాలని అత్యంత దృఢంగా ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగం నేటికీ 77 సంవత్సరాలు పురస్కరించుకున్నందున మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ ప్రైవేటు యువజన సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేసి భారత రాజ్యాంగం గురించి కొనియాడారు, ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పుట్టల మధు జండా ఆవిష్కరించి మాట్లాడారు, ఈ దేశంలో ప్రతి ఒక్కరు విద్యా వైద్యం ఉద్యోగ రంగాలలో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నరాని అన్నారు అనంతరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామీణ స్థాయి క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు మొదటి రెండవ మూడవ బహుమతులను కార్యదర్శి గ్రామ సర్పంచ్ పుట్టల సందీప్ కుమార్, అంబేద్కర్ ప్రధాన కార్యదర్శి రమణపల్లి సంజయ్ చేతుల మీదుగా అందించారు,ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గుండెబోయిన మల్లయ్య వార్డు మెంబర్లు బొంగర్ల సూకన్య వినోద్, మాతంగి సుధీర్, మాజీ సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, రేగటి రవీందర్ రెడ్డి వైస్ ఎంపీపీ రావు ఎల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలికాంతారెడ్డి, ఏఈఓ నితిన్అంబేద్కర్, పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్,వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఉగ్గే మునీశ్వర్, గుడుగుంట్ల సుందర్, పుట్టల దినేష్, మాజీ అధ్యక్షుడు అనిల్, అంబేద్కర్ యూత్ కమిటీ సభ్యులు వంటపాక వంశీ గుడుగుంట్ల కిరణ్, ,గిరి కోటేష్ సన్నీ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.







