నారద వర్తమాన సమాచారం
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వినుకొండ లోని గురుకులం పాఠశాల లో విద్యార్థులకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
నులిపురుగులు బాలలను శక్తి హీను లుగా మారుస్తాయి. అన్నివిధాలా ఆరో గ్యాన్ని క్షీణింపజేస్తాయి. వాటి నివారణే ప్రధాన ధ్యేయంగా జిల్లాలో వినుకొండలో డా బి ఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో జరిగిన డీవార్మింగ్ డే కార్యక్రమమును జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ప్రారంభించారు . 1-19 ఏళ్ల వయసు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులు ఎక్కువగా మట్టిలో ఆడుకో వడం, చేతులు పరిశుభ్రం చేసుకోకపోవ డంతో ఈ పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీంతో ఆరోగ్యం క్షీణిస్తుంది. 50 శాతానికి పైగా చిన్నారులు ఏదొక రకం నులిపు రుగుల బారిన పడి రక్తహీనతకు, అనారోగ్యానికి గురవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి కావున, జిల్లాలలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికలందరూ ఆల్బెంజోల్ మాత్రలను తీసుకొని ఈ కార్యక్రమమును జయప్రదం చేయవలసిందిగా కోరారు.మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అల్బెండజోల్ మాత్ర తీసుకోవాలని, 1 నుంచి 5 ఏళ్లలోపు ఉన్న వారికి సగం మాత్ర గ్లాసు నీటిలో కరిగించి తాగించాలి. 6 నుంచి 19 ఏళ్లలోపు వారు ఒక్క మాత్రను మింగాలి. మధ్యాహ్నం భోజనమైన అరగంట తర్వాత ఈ మాత్రలు వేసుకోవాలని సూచించినారు.
డాక్టర్. బి .రవి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి, గారు మాట్లాడుతూ ఈ వ్యాధి వలన కలిగే అనారోగ్యాలను తెలియజేసినారు ముఖ్యంగా పిల్లలలో ఈ నులిపురుగుల వలన రక్తహీనత, నీరసం, ఆయాసం, ఎదుగుదల లోపించడం, మల మూత్ర విసర్జన ప్రదేశాల్లో దురద, చర్మంపై ఎర్రని దద్దులు, దురదరావడం, బరువు తగ్గడం, పోషకాహార లోపం, కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, మలంలో రక్తం పడడం, జ్వరం, తలనొప్పి ఉండడం, ఆకలి తగ్గడం వంటి లక్షణాలు వీటి ద్వారా కలు గుతాయి. నులి పురుగులు శరీరంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు భోజనానికి ముందు, ఆటలు ఆడిన తర్వాత, మల విసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి చేసుకోవాలని తెలియజేసినారు జిల్లాలలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు కలిగిన బాలబాలికలందరూ ఆల్బెంజోల్ మాత్రలను తీసుకొని 100% లక్ష్యాలను పూర్తిగా సాధించాలని కోరినారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి మధులత తదితరులు
పాల్గొన్నారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వినుకొండ లోని గురుకులం పాఠశాల లో విద్యార్థులకు ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ లను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








