నారద వర్తమాన సమాచారం
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
పల్నాడు:
ఈనెల 21వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినుకొండలో పర్యటించనున్న నేపథ్యంలో, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా బుధవారం జిల్లా కలెక్టరేట్లోని తన కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పర్యటనలో ఎక్కడా చిన్నపాటి లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
’స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర’ కార్యక్రమం పర్యటనలో భాగంగా వినుకొండలోని ఎన్.ఎస్.పి (NSP) గ్రౌండ్లో ఏర్పాటు చేయనున్న ప్రజా వేదికను సర్వాంగ సుందరంగా సిద్ధం చేయాలన్నారు. ప్రజా వేదిక ప్రాంగణంలోనే ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన స్టాల్స్‌ను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయాలని, అక్కడికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు.
అధికారులందరూ క్షేత్రస్థాయిలో నిమగ్నమై పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
ఈ సమావేశంలో జిల్లా ఏరియా ఆసుపత్రుల కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసూన, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ రీజినల్ అధికారిణి నజీరా బేగం, ఆసుపత్రి సూపరింటెండెంట్ దయానిధి, ఏపీ ఎం.ఎస్.ఐ.డి.సి అధికారి హనుమంతరావు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








