నారద వర్తమాన సమాచారం
మెదక్ జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు
భూవివాదాన్ని క్షేత్ర స్థాయిలో విచారించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ కు హైకోర్టు ఆదేశం
గడువు ముగిసినా ఎలాంటి చర్యలు తీసుకోని కలెక్టర్
కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ శిక్ష విధించిన హైకోర్టు
భూ వివాదానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా కూడా విధించింది. ఉన్నత స్థాయి అధికారికి ఇలాంటి శిక్ష పడటం రాష్ట్రవ్యాప్తంగా అధికార వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








