నారద వర్తమాన సమాచారం
సీఎం పర్యటన నేపథ్యం లో వినుకొండ పట్టణం నందు ముందస్తు ఏర్పాట్లు పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఐపీఎస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలోని వినుకొండ పట్టణమునకు ది.21/02/2026 వ తేదీన స్వచ్ఛంద్ర – స్వర్ణాంధ్ర(SASA) కార్యక్రమానికి విచ్చేయుచున్న సందర్భంగా పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఐపిఎస్ హెలిపాడ్ గ్రౌండ్ ను,మీటింగ్ జరుగు ప్రాంతాలను,CHC లను, పార్కింగ్ ప్రాంతాలను విజిట్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు వినుకొండ టౌన్ సిఐ ప్రభాకర్ , వినుకొండ రూరల్ సీఐ బ్రహ్మయ్య మరియు ఎస్సై లు హాజరయ్యారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.








