నారద వర్తమాన సమాచారం
భవన నిర్మాణ కార్మికులకు శుభవార్త — మార్చి 1 నుండి సంక్షేమ పథకాలు పునరుద్ధరణ
చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలను 2026 మార్చి 1 నుండి పునరుద్ధరించింది. ఈ నిర్ణయంతో పల్నాడు జిల్లాలో నమోదైన 1,16,927 మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది.
పునరుద్ధరించిన పథకాల్లో వివాహ కానుక, ప్రసూతి ప్రయోజనం, సహజ మరణ ఉపశమనం మరియు అంత్యక్రియల ఖర్చు సహాయం ఉన్నాయి.
ప్రసూతి సాయం: కార్మికుని భార్య లేదా ఇద్దరు కుమార్తెల ప్రసవ సమయంలో రూ.20,000 చొప్పున అందిస్తారు. ప్రసవం అయిన ఆరు నెలల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వివాహ కానుక: కార్మికుని కుమార్తె లేదా మహిళా కార్మికురాలు వివాహం చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ సహాయం అందిస్తారు. పెళ్లి అయిన ఆరు నెలల లోపు మ్యారేజ్ సర్టిఫికెట్తో దరఖాస్తు చేసుకోవాలి.
సహజ మరణ ఉపశమనం: సహజ మరణం పొందిన కార్మికుని కుటుంబానికి రూ.60,000 అందిస్తారు. మరణించిన ఒక సంవత్సరం లోపు దరఖాస్తు చేసుకోవాలి.
అంత్యక్రియల సహాయం: మృతి చెందిన కార్మికుని కుటుంబానికి అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.20,000 అందిస్తారు.
18 నుండి 60 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్న నమోదిత భవన నిర్మాణ కార్మికులు ఈ పథకాలకు అర్హులు. మరింత సమాచారం కోసం సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని సహాయ కమిషనర్ ఆఫ్ లేబర్ షేక్ మహబూబ్ సుభాని తెలిపారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









