నారద వర్తమాన సమాచారం
గిరిజనుల చెంత జనసేన ఆవిర్భావ వేడుకలు…థింసా నృత్యంతో స్వాగతం…పార్టీ పతాకావిష్కరణ
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలో అత్యంత ఘనంగా జరిగాయి.పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గిరిజన గడ్డపై అట్టహాసంగా వేడుకలను నిర్వహించారు.ప్రజల మధ్యే పార్టీ వేడుకలు జరగాలన్న లక్ష్యంతో ఆయన గిరిజన పల్లెలను ఎంచుకోవడం విశేషం.
నందిగరువు చేరుకున్న ఉపముఖ్యమంత్రికి గిరిజన మహిళలు తమ సంప్రదాయ ‘థింసా’ నృత్యంతో నీరాజనాలు పలికారు.వారి సంస్కృతిని గౌరవిస్తూ పవన్ కల్యాణ్ వారితో ముచ్చటించారు.అనంతరం నందిగరువులో పార్టీ పతాకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









