నారద వర్తమాన సమాచారం
శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా కత్తి జ్యోతి బాబు నియామకం
శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా గురుజాల పట్టణానికి చెందిన కత్తి జ్యోతిబాబును నియమించినట్లు
శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజా హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు గురజాల అప్పారావు తెలిపారు.
మాచర్ల లోని సంఘ కార్యాలయం నందు శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో జ్యోతి బాబును ఏకగ్రీవంగా నియమించారు
ఈ సందర్భంగా జ్యోతి బాబు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చినందుకు అధ్యక్షులు గురజాల అప్పారావుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ పదవి రావడానికి సహకరించిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు
నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద కులాల హక్కుల కోసం వారి అభ్యున్నతి కోసం పనిచేస్తానని ఆయన అన్నారు.
కత్తి జ్యోతిబాబుకు ఈ పదవి రావటంపై పల్నాడు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ మరియు దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు
డాక్టర్ కుక్కమూడి ప్రసాద్,
దళిత సీనియర్ నాయకులు పరిమళ్ళ రాజారావు, బీసీ నవ చైతన్య వేదిక పల్నాడు జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి ఈశ్వరయ్య హర్షం వ్యక్తం చేశారు
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









