Tuesday, March 17, 2026
spot_img

గ్యాస్ సరఫరా పై సందేహాలు పెట్టుకోవద్దు అని విజ్ఞప్తి చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్ల ఐ ఏ ఎస్…!

నారద వర్తమాన సమాచారం

గ్యాస్ సరఫరా పై సందేహాలు పెట్టుకోవద్దు అని విజ్ఞప్తి చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తిక  శుక్ల ఐ ఏ ఎస్…!

గ్యాస్ సరఫరా పై సందేహం ఉన్న యెడల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు
కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08647 252999 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చును.
జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా

మార్చి :గ్యాస్ సరఫరా పై సందేహం ఉన్న యెడల జిల్లా కలెక్టర్ కార్యాలయం నందుకంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08647252999 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చును అని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ప్రకటనలోని సారాంశం క్రింది విధంగా ఉన్నది
జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల పై జిల్లా పౌరసరఫరాల అధికారి వారు తెలియజేయునది ఏమనగా జిల్లాలో గ్యాస్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ వినియోగదారులకు డొమెస్టిక్ సిలిండర్లు సాధారణంగానే సరఫరా కొనసాగుతుందని ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేయడమైనది మరియు గ్యాస్ సరఫరా పై ఎప్పటి కప్పుడు సమాచారం తెలుసుకొనుటకు చ కలెక్టరేట్ కార్యాలయం నందుకంట్రోల్ రూమ్ అన్ని పని దీనములో 24 గంటలు అందుబాటులో ఉంటారు ,సంప్రదించవచ్చును మరియు జిల్లాలో వినియోగదారులకు తగిన విదముగా గ్యాస్ నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవటం జరిగినది మరియు ప్రతి ఏజెన్సీ నందు తహశీల్దార్ ను గ్యాస్ సరఫరా పై పరవేక్షణ కొరకు నియమించట జరిగినది. కావున ఎవ్వరూ తొందరపడి వెంటవెంటనే గ్యాస్ రెఫిల్లింగ్ కొరకు బుకింగ్ చేసుకోవద్దని వద్దంతలు నమ్మవద్దని తెలిపారు. వినియోగదారులు గ్యాస్ బిల్లు లో ఉన్న ధర మాత్రమే డెలివరి బాయ్ కి చెల్లించాలని ఏ విదమైన అదనపు రుసుము చెల్లించనవసరం లేదు ఎవ్వరైన ఎక్కువ మొత్తం డిమాండ్ చేసిన యెడల పిర్యాదు చేయవచ్చు అని తెలిపియున్నారు. గ్యాస్ సిలిండర్ ఆక్రముగా నిల్వ చేసి కృతిమ కొరత సృష్టించే వ్యక్తులు సంస్థలపైన మరియు డొమెస్టిక్ సిలిండర్ వాణిజ్య అవసరాల వినియోగించే సంస్థలపైన కేసులు నమోదు చేయటం జరుగుతుందని తెలిపారు. ఏజెన్సీ యజమానులు వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా నిండు సిలిండర్లు సరఫరా చేయవలయునని పై ప్రకటనలో తెలిపారు


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading