నారద వర్తమాన సమాచారం
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తో విజయ ధారి ఫౌండేషన్ వారి అన్నదాన కార్యక్రమం…
సమాజ సేవలో భాగంగా వృద్ధులు మరియు అనాధలకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని స్థానిక సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది నీ పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వృద్ధులు, అనాధలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విజయధారి ఫౌండేషన్ వారు మాట్లాడుతూ, సమాజంలో నిరాధారంగా ఉన్నవారికి సహాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రతీ నెల ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి అవసరమైన వారికి భోజనం అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో పాల్గొన్న వృద్ధులు, అనాధలు నిర్వాహకులైన విజయధారి ఫౌండేషన్ వారికికృతజ్ఞతలు తెలియజేశారు. వారికి భోజనం పండ్లు కూడా పంపిణీ చేశారు. స్థానిక యువత కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవలు అందించారు.
ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో సేవా భావం పెంపొందుతుందని, మరిన్ని సేవా కార్యక్రమాలకు ఇది ప్రేరణగా నిలుస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.









