Saturday, March 21, 2026
spot_img

సెలవు రోజుల్లోను పనిచేయనున్న జిఎంసి క్యాష్ కౌంటర్లు … కమిషనర్ మయూర్ అశోక్

నారద వర్తమాన సమాచారం

సెలవు రోజుల్లోను పనిచేయనున్న జిఎంసి క్యాష్ కౌంటర్లు … కమిషనర్ మయూర్ అశోక్

2025–26 ఆర్ధిక సంవత్సరము ఆస్తి పన్ను, బకాయిలను చెల్లించుటకు వీలుగా, శనివారం (రంజాన్ పండుగ), ఆదివారం శెలవు రోజులైనప్పటికీ కూడా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో పన్ను చెల్లింపు కేంద్రాలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు యధావిధిగా పనిచేస్తాయని, బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏక మొత్తంగా చెల్లించే ఆస్తి పన్ను వడ్డీపై 50 శాతం రాయితీ ప్రకటించిందని, నగర ప్రజలు ఆస్తి, ఖాళీ స్థల పన్నులు మరియు నీటి పన్నులు పూర్తిగా చెల్లించి నగరాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. పన్ను చెల్లింపుదారులకు వీలుగా సెలవు రోజులైనప్పటికీ జిఎంసి ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంలోని క్యాష్ కౌంటర్లలో నగర పాలక సంస్థకు చెల్లించవలసిన పన్ను చెల్లించవచ్చన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

You cannot copy content of this page

Discover more from

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading